ETV Bharat / business

Face Recognition for ATM and Bank Transactions : మీ డబ్బులు సేఫ్.. ఏటీఎంలో ఫేస్‌ రికగ్నిషన్..!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 9:47 AM IST

Face Recognition for ATM and Bank Transactions : బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు విత్​డ్రా చేసుకోవడానికి మరో పకడ్బందీ సర్వీస్ రాబోతోంది. ఈ విధానం అమలులోకి వస్తే.. మీ అనుమతి లేకుండా ఎవ్వరూ బ్యాంకు నుంచి డబ్బులు తీయలేరు. మరి, ఇంతకీ ఏంటీ ఆ కొత్త విధానం? అది ఎలా పనిచేస్తుంది? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Face Recognition for ATM and Bank Transactions
Face Recognition for ATM and Bank Transactions

Banks can Use Face Recognition Iris Scan for Transactions : ఈ రోజుల్లో పెరిగిపోతున్న ఆన్​లైన్​ బ్యాంక్​ మోసాలకు అంతే లేకుండా పోతోంది. పాస్ వర్డ్ పెడితే.. హ్యాక్ చేస్తున్నారు. ఫిషింగ్ లింక్స్​ పంపుతూ.. ఖాతా ఖాళీ చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుల భద్రతకోసం.. సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు సరికొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఏటీఎంల(Withdraw Money from ATMs) నుంచి డబ్బులు డ్రా చేసుకునే విషయంలో ఈ నూతన విధానం అప్లై చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇంతకీ ఆ నయా సర్వీస్ ఏంటి?

Banks use Face Recognition for Transactions : ఏటీఎంల నుంచి సురక్షితంగా డబ్బులు విత్​డ్రా చేసుకోవడానికి ఫేస్ రికగ్నిషన్‌(Face Recognition) ఆప్షన్ వినియోగిస్తే ఎలా ఉంటుందనే విషయమై బ్యాంకులు యోచిస్తున్నాయట. ఇప్పటికే.. ఈ విధానం మనం స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్నాం. దీనివల్ల.. మన అనుమతి లేకుండా వేరేవాళ్లు ఎవ్వరూ మన ఫోన్ ఓపెన్ చేయలేరు. ఇదేవిధంగా.. ఏటీఎం బ్యాంకు లావాదేవీలకూ వర్తింపచేయాలని బ్యాంకులు చూస్తున్నాయని తెలుస్తోంది.

Banks can Use Iris Scan for Transactions : ఆర్థిక లావాదేవీల్లో జరిగే మోసాల కట్టడికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుందని బ్యాంకులు యోచిస్తున్నాయి. పన్ను ఎగవేతలను సమర్థవంతంగా గుర్తించేందుకు సైతం ఈ ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్‌ యూజ్ అవుతుందని భావిస్తున్నాయట. ఇప్పటికే ఈ విధానాన్ని ఉపయోగించడానికి.. కొన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.

UPI ATM Cash Withdrawal Process : 'యూపీఐ ఏటీఎం'తో.. ఇకపై కార్డ్ లేకుండానే క్యాష్​ విత్​డ్రా!

త్వరలో రానున్న కొత్తం చట్టం : అయితే.. ఈ విషయంలో కొన్ని చట్టపరమైన చిక్కులు ఉన్నాయని సమాచారం. ఇప్పటి వరకు సైబర్ భద్రత, గోప్యత, ఫేస్‌ రికగ్నిషన్‌పై ప్రత్యేక చట్టం ఏదీ లేనందున.. పలు ఇబ్బందులు తలెత్తవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే.. ఈ ఏడాదిలోనే నూతన చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ పద్ధతి వినియోగం అన్నది వినియోగదారుడి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి, ఏం జరగనుందన్నది చూడాల్సి ఉంది.

How to Withdraw Cash from ATM without Debit Card : 'డెబిట్ కార్డు' లేకున్నా.. డబ్బులు ఇలా డ్రా చేయండి!

గూగుల్​ పే, పేటీఎంతో.. ఏటీఎం నుంచి మనీ విత్​డ్రా... ఎలాగంటే?

డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎం నుంచి క్యాష్​ విత్​డ్రా చేసుకోవడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.