ETV Bharat / business

BYJUs Lay Off : బైజూస్​లో 3,500కు పైగా ఉద్యోగాల కోత!.. కారణం అదేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 12:58 PM IST

BYJUs Lay Off News In Telugu : ప్రముఖ దేశీయ ఎడ్​టెక్​ కంపెనీ బైజూస్​ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సన్నాహాలు చేస్తోంది. సంస్థ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BYJU job cut news 2023
BYJU Lay Off

BYJUs Lay Off : దేశంలోని అతిపెద్ద ఎడ్​టెక్​ కంపెనీ బైజూస్ ఈ ఏడాది​ దాదాపు 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంస్థ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అర్జున వ్యూహం!
Byjus New CEO Arjun Mohan : ఇటీవలే అర్జున్​ మోహన్ బైజూస్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే సంస్థ పునర్​వ్యవస్థీకరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా ఈ ఏడాది దాదాపు 3,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వ్యయాలను అదుపు చేయడానికే!
Byjus Employee Layoffs : కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో బైజూస్ కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. అప్పట్లో డిజిటల్ ఎడ్యుకేషన్​కు మంచి ఆదరణ ఉండడం వల్ల ఇది కంపెనీకి లాభసాటిగానే ఉండింది. కానీ కొవిడ్ సమస్య తెరమరుగు అయ్యాక సంస్థ లాభాలు బాగా క్షీణించాయి. ఉద్యోగుల జీతభత్యాల ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. దీనితో సంస్థపై తీవ్రమైన ఆర్థికభారం పడింది. ఈ నేపథ్యంలోనే బైజూస్​ కంపెనీ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. అందులో భాగంగా సాధారణ ఉద్యోగులతోపాటు, సీనియర్ ఎగ్జిక్యూటివ్​లను సైతం తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా బహుశా ఈ వారంలోనే జరిగే అవకాశం ఉన్నట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం.

కొత్త టీమ్స్ ఏర్పాటు!
ప్రస్తుతం బైజూస్​లో ఉన్న చాలా విభాగాలను విలీనం చేసి సరికొత్త టీమ్​లను ఏర్పాటు చేసేందుకు అర్హున్ మోహన్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఆఫ్​లైన్​, ఆన్​లైన్ రెండు విభాగాల్లోనూ ఒకే స్టాఫ్​ను ఉపయోగించుకోనున్నారు. అదనంగా ఉన్న ఉద్యోగులను బయటకు పంపనున్నారు.

'ఆకాశ్' పరిస్థితి ఏమిటి?
BYJUs Aakash News : బైజూస్​ సంస్థకు ఆకాశ్​ అనే అనుబంధ సంస్థ ఉంది. అయితే ఆకాశ్ సంస్థతో పాటు, బైజూస్​ కంపెనీకి చెందిన విదేశీ వ్యాపారాల్లోనూ.. ప్రస్తుతానికి ఎలాంటి ఉద్యోగాల కోత ఉండదని తెలుస్తోంది.

భారీగా కోతలు!
2021 సంవత్సరంలో బైజూస్​ సంస్థలో అత్యధికంగా 52 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. తరువాత సంస్థ నష్టాలపాలు కావడం, జీతభత్యాల వ్యయాలు పెరగడం మొదలైంది. దీనితో క్రమంగా ఉద్యోగులను తొలగిస్తూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం, 3,500 ఉద్యోగులను తొలగిస్తే.. బైజూస్ ఎంప్లాయీస్​ సంఖ్య 35 వేలకు చేరుతుందని ఓ అంచనా.

Travel Now Pay Later : టూర్​ కోసం ప్లాన్ చేస్తున్నారా?.. చేతిలో డబ్బులు లేవా?.. అయితే TNPL లోన్​ ట్రై చేయవచ్చు!

Mukesh Ambani Children Salary : జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంబానీ పిల్లలు.. మరి వీరికి ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.