ETV Bharat / business

రూ.10 లక్షల్లోపు బెస్ట్​ కారు కావాలా? ఈ 3 బ్రాండ్స్ చెక్​ చేయండి - అదిరిపోయే​ ఫీచర్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 12:19 PM IST

Best Cars under 10 Lakhs with High Mileage and Safety Features: పండగ సీజన్​లో కొత్త కారు కొనాలని చూస్తున్నారా..? మీ బడ్జెట్​ 10 లక్షల రూపాయలా..? అయితే.. మీ కోసమే ఇది. టాప్​ కంపెనీలకు చెందిన 3 కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేసి.. నచ్చితే ఇంటికి తెచ్చుకోండి.

Best Cars under 10 Lakhs with High Mileage
Best Cars under 10 Lakhs with High Mileage and Safety Features

Best Cars under 10 Lakhs with High Mileage and Safety Features: పండగ సీజన్‌ వచ్చిందంటే కొత్త కారు కొనాలని చాలా మంది ప్లాన్‌ చేస్తుంటారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రముఖ కార్ల కంపెనీలు.. కొత్త కొత్త మోడళ్లతో పాటు.. ప్రస్తుతం ఉన్న కార్లపైనా ఆఫర్లు ప్రకటిస్తాయి. అలాంటి ఆఫరే ఇది. రూ.10 లక్షల బడ్జెట్​లో.. సేఫ్టీ పరంగా, మైలేజ్‌ పరంగా మూడు ది బెస్ట్‌ SUV లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దివాళీ ఆఫర్ - ఈ ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్​, అదిరే ఫీచర్లు మీ సొంతం!

టాటా పంచ్​ (Tata Punch) : కార్ల తయారీలో దేశీయ దిగ్గజం టాటా మోటార్స్​కు చెందిన.. "టాటా పంచ్" దేశంలోనే అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ SUV గా గుర్తింపు సాధించింది.

  • గ్లోబల్‌ NCAP లో ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.
  • పంచ్‌లో 1.2లీటర్‌ రెవట్రాన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు.
  • 88 bhp శక్తిని, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • టాటా పంచ్ పరిమాణంలో చిన్నదిగా కనిపించినా.. ఇందులో ఐదుగురు సౌకర్యంగా కూర్చోవచ్చు.
  • 366 లీటర్ల బూట్ స్పేస్, 5స్పీడ్‌ మాన్యూవల్‌ గేర్‌ బాక్స్‌, 5స్పీడ్‌ ఆటో వెర్షన్‌ను ఆప్షనల్‌గా ఇచ్చారు. ఇంకా.. మరెన్నో ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి.
  • టాటా పంచ్‌ పెట్రోల్ వెర్షన్ 20.09 kmpl, CNG 26.99 కి.మీ మైలేజ్‌ని ఇస్తుంది.
  • మార్కెట్లో దీని ధర రూ. 6 లక్షల నుంచి ఉంది. టాప్‌ వేరియంట్‌ ధర రూ. 9.52 లక్షలు (ఎక్స్-షోరూమ్).

లోన్​ తీసుకునే వారికి గుడ్​న్యూస్​-దీపావళి సందర్భంగా బ్యాంకుల బంపరాఫర్​!

మారుతి సుజుకీ బ్రెజా (Maruti Suzuki Brezza) : మారుతి బ్రాండ్‌లోని అన్ని కార్లలో అత్యంత సురక్షితమైన కారుగా బ్రెజా గుర్తింపు పొందింది.

  • గ్లోబల్ NCAP నుంచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.
  • బ్రెజా ఇంజిన్‌ విషయానికొస్తే ఇందులో 1.5-లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు.
  • ఇది 19.8 kmpl మైలేజ్‌ని, CNG వెర్షన్ 25.51 kmpl మైలేజ్‌ని అందిస్తుంది.
  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి.
  • అంతే కాకుండా.. 360-డిగ్రీ కెమెరా, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
  • మారుతి సుజుకి బ్రెజా బేస్ వేరియంట్ ధర రూ. 8.29 లక్షలు (ఎక్స్‌ షో రూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.

కారు ఇన్సూరెన్స్ - ఈ ప్లాన్​​ తీసుకోకపోతే జేబులోంచి డబ్బు తీయాల్సిందే!

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ (Hyundai Exter) : హ్యుందాయ్‌ మోటార్స్ ఇండియా లిమిటెడ్‌ భారత మార్కెట్లోకి ఓ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ (Hyundai Exter)ని విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఫీచర్-రిచ్ SUVని కొనుగోలు చేయాలనుకునేవారికి Exter బెస్ట్‌ ఆప్షన్‌. ఎందుకంటే.. ఈ కారులో 60కి పైగా అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

  • ఈ కారులో 1.2 లీటర్‌ నేచురల్ అస్పిరేటెడ్(NA) ఇంజిన్‌ అమర్చారు. ఇది 83 బీహెచ్‌పీ, 114ఎన్‌ఎం టార్క్‌ విడుదల చేస్తుంది.
  • ఇది 5స్పీడ్‌ మాన్యూవల్‌, 5 స్పీడ్‌ ఆటో గేర్‌బాక్స్‌ల ఆప్షన్లలో లభిస్తోంది.
  • సీఎన్‌జీ ఇంజిన్‌ 69 బీహెచ్‌పీ, 95.2 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
  • ఏఎంటీ గేర్‌బాక్స్‌కు పెడల్‌ షిఫ్టర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.
  • పెట్రోల్‌ ఇంజిన్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌ మైలేజీ లీటర్‌కు 19.4 కిలోమీటర్లుగా కంపెనీ చెబుతోంది.
  • ఆటోమేటిక్‌ వేరియంట్‌ 19.2గా, సీఎన్‌జీ వేరియంట్‌ కిలోకు 27.1 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించింది.
  • 6 ఎయిర్‌బ్యాగ్‌లు, డ్యూయల్ కెమెరా డాష్‌క్యామ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, TPMS, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో ప్రవేశపెట్టారు.
  • హ్యుందాయ్ ఎక్స్‌టర్ బేస్‌ ధర రూ.6 లక్షలుగా ఉంది

కారు సేఫ్టీ కోసం సూపర్ ఇన్సూరెన్స్ - ఈ యాడ్-ఆన్స్​ కచ్చితంగా ఉండాల్సిందే!

కారు కొనడానికి లోన్‌ కావాలా? తక్కువ వడ్డీకే ఎస్‌బీఐ రుణం! ఈజీ ఈఎంఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.