అమెజాన్​లో 'ప్రెషర్ కుక్కర్'​ కొన్నారా? అయితే బీ అలర్ట్​!

author img

By

Published : Aug 4, 2022, 5:26 PM IST

amazon pressure cooker recall

ప్రముఖ ఈ-కామర్స్​ వెబ్​సైట్​ అమెజాన్​లో ప్రెషర్ కుక్కర్ కొన్నారా? అయితే.. ఈ సమాచారం మీకోసమే. నాణ్యత సరిగా లేని కుక్కర్లు అమ్మినందుకు అమెజాన్​కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జరిమానా వేసింది. కస్టమర్లను స్వయంగా సంప్రదించి, ఆ కుక్కర్లను వెనక్కి తెప్పించాలని ఆదేశించింది.

Amazon pressure cooker recall : నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్లు అమ్మినందుకు అమెజాన్​కు జరిమానా విధించింది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ). లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఆ కుక్కర్లు అన్నింటినీ వెనక్కి తెప్పించాలని నిర్దేశించింది.

భారత్​లో విక్రయించే వస్తువులు.. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్​-క్యూసీఓలో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలకు తగినట్లు ఉండాలి. అయితే.. క్యూసీఓ నాణ్యతా ప్రమాణాలను అందుకోకపోయినా తన ప్లాట్​ఫాం ద్వారా 2,265 ప్రెషర్ కుక్కర్లు విక్రయించేందుకు వెండర్లకు అమెజాన్ అనుమతి ఇచ్చిందని సీసీపీఏ గుర్తించింది. వీటి ద్వారా ఆ సంస్థ రూ.6,14,825 ఆర్జించిందని నిర్ధరించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానా విధించింది. నాణ్యత సరిగా లేని కుక్కర్లను కొన్న కస్టమర్లను సంప్రదించి, ఆ వస్తువుల్ని వెనక్కి తెప్పించి, వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని అమెజాన్​ను ఆదేశించింది సీసీపీఏ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.