ETV Bharat / business

AI, క్వాంటమ్ కంప్యూటింగ్​.. ఈ ఏడాది డిజిటల్ రంగాన్ని మార్చేవి ఇవే!

author img

By

Published : Feb 16, 2023, 6:33 AM IST

2023లో కృత్రిమ ఏఐ, మల్టీ క్లౌడ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లదే భవిష్యత్​ అని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఏడాదిలో ఏఐ వినియోగం భారీ స్థాయిలో జరుగుతుందని వెల్లడించింది. చాట్‌బాట్స్‌ నుంచి చిప్‌ పరిశ్రమలో హార్డ్‌వేర్‌ తయారీ వరకు ఏఐ ముందుంటుందని పేర్కొంది.

ai digital transformation
డిజిటల్ రంగంలో మార్పులు

ఈ ఏడాది డిజిటల్‌ రంగంలో మార్పును ముందుండి నడిపించేవి కృత్రిమ మేధ(ఏఐ), మల్టీ-క్లౌడ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లేనని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ తాజా నివేదికలో వెల్లడించింది. బుధవారం వెలువరచిన 'టెక్‌ ట్రెండ్స్‌' 2023 ఎడిషన్‌ నివేదికలో ఇంకా ఏమందంటే..

  • 5జీ అప్లికేషన్లు ప్రధాన స్రవంతిలోకి వస్తాయి. రాబోయే ఏళ్లలో టెలికాం కంపెనీలకు, కార్పొరేట్లకు మధ్య భాగస్వామ్యాలు పెరుగుతాయి. దీని వల్ల 5జీ అప్లికేషన్లు భారీగా పెరుగుతాయి.
  • ఈ ఏడాదిలో గమనించదగ్గ అగ్రగామి 10 సాంకేతిక ధోరణులను మేం ఉదహరిస్తున్నాం. భవిష్యత్తుకు సిద్ధం కావడానికి కంపెనీలకు ఇవి ఉపయోగపడతాయి. 2023లో ఏఐ, మల్టీ క్లౌడ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సస్టెయినబిలిటీ అప్లికేషన్లు కీలకంగా మారతాయి. ఇవి డిజిటల్‌ రంగంలో పెను మార్పునకు దోహదం చేస్తాయి.
  • ఈ ఏడాదిలో ఏఐ వినియోగం భారీ స్థాయిలో జరుగుతుంది. చాట్‌బాట్స్‌ నుంచి చిప్‌ పరిశ్రమలో హార్డ్‌వేర్‌ తయారీ వరకు ఇది ముందుంటుంది.
  • మల్టీ-క్లౌడ్‌ కూడా జోరందుకుంటుంది. ప్రభుత్వ, పరిశ్రమ క్లౌడ్‌లు పెరుగుతాయి. 2027 కల్లా కార్పొరేట్లలో సగం మంది క్లౌడ్‌ సొల్యూషన్లను వినియోగిస్తారు.
  • 'వర్స్‌' ఆవిర్భావం జరుగుతుంది. 5జీ, ఏఐ, ఎక్స్‌టెండెడ్‌ రియాల్టీ వంటి సాంకేతికతలతో కంపెనీలు తమను తాము పునర్‌ నిర్వచించుకుంటాయి.
  • పర్యావరణహిత మార్గంలోకి వెళ్లేందుకు సాంకేతికతను కంపెనీలు వినియోగించుకుంటాయి.
  • ఉద్యోగులకు అనువుగా ఉండే ధోరణులు పెరుగుతాయి. ఇందుకూ సాంకేతికతే ఉపయోగపడుతుందన్నది అంతర్జాతీయంగా సగం మంది హెచ్‌ఆర్‌ నాయకుల మాటగా ఉంది.
  • వినూత్న సాంకేతికతలు మెరుగైన అనుభవాన్ని ఇస్తాయి. నియామకాల నుంచి నైపుణ్యాల పెంపు వరకు ఇవి కనిపిస్తాయి.
  • సమన్వయ రోబో లేదా కోబోట్స్‌ రాబోయే ఏళ్లలో రాణిస్తాయి. మనుషుల్లో భావోద్వేగాలను గుర్తించి అందుకు తగ్గట్లుగా స్పందించే కంప్యూటేషనల్‌ ఎంపథీతో ఇవి పనిచేస్తాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.