ETV Bharat / business

ఆన్​లైన్​ గేమింగ్​, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ!

author img

By

Published : Jun 27, 2022, 8:41 AM IST

GST on casinos in India: ప్రస్తుతం 18 శాతంగా ఉన్న క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై ఇకపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఈ నెల 28-29 తేదీల్లో చండీగఢ్‌ వేదికగా జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

gst on casinos in india
gst on casinos in india

GST on casinos in India: క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఈ నెల 28-29 తేదీల్లో చండీగఢ్‌ వేదికగా జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సమర్పించిన ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. గతేడాది మేలో ఈ మూడింటికి సంబంధించి మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలో కమిటీ వేయగా.. ఈ మేరకు ప్రస్తుతం దీనికి సంబంధించిన సిఫార్సులు చేసింది. కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 8 మంది ఆర్థిక మంత్రులు సభ్యులగా ఉన్నారు.

ఇదీ చదవండి: అతి త్వరలోనే ఈ-పాస్‌పోర్ట్‌లు.. డేటా పూర్తిగా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.