మార్కెట్లపై బేర్​ పంజా- సెన్సెక్స్​ 456 పాయింట్లు డౌన్

author img

By

Published : Oct 20, 2021, 3:45 PM IST

stocks closing

స్టాక్ మార్కెట్లు(Stock Market) బుధవారం సెషన్​లో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 456 పాయింట్లు, నిఫ్టీ(Nifty today) 152 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఆటో, ఎఫ్​ఎంసీజీ, ఆయిల్​, గ్యాస్,​ విద్యుత్,​ లోహ రంగాల షేర్లు నష్టపోయాయి.

అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు(Stock Market) చివరకు నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​(Sensex Today) 456 పాయింట్లు కోల్పోయి. 61,259 వద్ద బుధవారం సెషన్​ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ(Nifty today) 152 పాయింట్ల నష్టంతో 18,266 వద్ద స్థిరపడింది.

ఆటో, ఎఫ్​ఎంసీజీ, ఆయిల్​, గ్యాస్​, పవర్,​ లోహ రంగాల షేర్లు 1-2శాతం క్షీణించగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల విలువ 1 శాతానికిపైగా వృద్ధి చెందింది. బీఎస్​సీ సెన్సెక్స్​ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పతనమయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా(Intraday)..

మార్కెట్​ తొలుత నష్టాలతో ప్రారంభమైంది. అనంతరం లాభాల బాట పట్టినా.. కాసేపటికే పరిస్థితి మారిపోయింది.

ఓ దశలో సెన్సెక్స్ 61,880 పాయింట్ల అత్యధిక స్థాయి, 61,109 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 18,458 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 18,209 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది

లాభానష్టాలోనివి ఇవే..

భారతీ ఎయిర్​టెల్​ 4 శాతం, ఎస్​బీఐ 2.57 శాతం​, ఇండస్​ బ్యాంక్​ 0.67 శాతం, బజాజ్​ ఫైనాన్స్ 0.46 శాతం, ఐటీసీ 0.20 శాతం లాభాలు గడించాయి.​

టైటాన్ 2.62 శాతం​, హిందుస్థాన్ యూనిలివర్ 2.26 శాతం, ఎన్​టీపీసీ 2.07 శాతం, బజాజ్​ఫిన్​సెర్వ్​ 2.06శాతం, ఎల్​ అండ్​ టీ 1.97 శాతం, పవర్​ గ్రిడ్ 1.96 శాతం​ నష్టాలు మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: Facebook Name Change: ఫేస్‌బుక్‌ పేరు మారనుందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.