ETV Bharat / business

పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటుకు సెబీ బోర్డు ఆమోదం

author img

By

Published : Sep 29, 2021, 7:19 AM IST

మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసకుుంది. పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోద ముద్రవేసింది. దీనితో పాటు మ్యూచువల్ ఫండ్ సంస్థలు వెండి ఈటీఎఫ్​లు తెచ్చేందుకు కూడా అనుమతులిచ్చింది.

SEBI
సెబీ

పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటు ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపింది. డిజిటల్ పసిడి రశీదుల రూపంలో ఈ ఎక్స్ఛేంజీల్లో పసిడిని ట్రేడ్ చేయొచ్చు. దేశీయంగా పసిడి స్పాట్ ధర లను నిర్ధరించే విధానంలో పారదర్శకత తీసుకొచ్చేందుకూ ఇది ఉపయోగపడనుంది. ఇందులో ట్రేడయ్యే పసిడిని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్​గా (ఈజీఆర్) పిలుస్తారు. ఈ ఈజీఆర్​లను సెక్యూరిటీలుగా నోటిఫై చేయనున్నామని సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. ఇతర సెక్యూరిటీల మాదిరిగానే.. ఈజీఆర్​లకు ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ వీలు ఉంటుందని ఆయన అన్నారు.

గుర్తింపు ఉన్న ప్రస్తుత లేదా కొత్త స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రత్యేక విభాగం కింద ఈజీఆర్​లకు ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. ఈజీఆర్​ల డినామినేషన్, ట్రేడింగ్, ఈజీఆర్​లను పసిడిలోకి మార్చడంపై సెబీ అనుమతుల ఆధారంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయం తీసుకుంటాయని త్యాగి చెప్పారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు వెండి ఈటీఎఫ్​లు తెచ్చేందుకు సెబీ ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి: ఆయనకు నెలలోనే రూ.900కోట్ల లాభం.. ఆ రెండు కంపెనీల షేర్లతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.