ETV Bharat / business

టీవీల దిగుమతులపై కేంద్రం కొత్త ఆంక్షలు

author img

By

Published : Jul 31, 2020, 1:58 PM IST

కలర్ టీవీ దిగుమతుల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది కేంద్రం. దేశీయంగా టీవీల ఉత్పత్తి చేసే సంస్థలకు ప్రోత్సాహమందించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల వివరాలు ఇలా ఉన్నాయి.

import restrictions on colour television
టీవీల దిగుమతిపై కేంద్రం ఆంక్షలు

'వోకల్ ఫర్ లోకల్'​లో భాగంగా దేశీయ టీవీల తయారీ సంస్థలకు ప్రోత్సాహమందించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాలు, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకునే కలర్ టీవీల వంటి నిత్యావసరాలు, ఉత్పత్తులపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం.

ఇందుకోసం ప్రస్తుతం ఉన్న కలర్ టీవీల దిగుమతి నిబంధనల్లో పలు మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం టీవీలను దిగుమతి చేసుకునే వాళ్లు..వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని డైరెక్టర్​ జనరల్ ఆఫ్ ఫారిన్​ ట్రేడ్​ (డీజీసీఎఫ్​టీ) తెలిపింది.

భారత్​ ప్రస్తుతం చైనా, వియత్నాం, హాంకాంగ్, కొరియా, ఇండోనేషియా, థాయ్​లాండ్, జర్మనీల నుంచి టీవీలను దిగుమతి చేసుకుంటోంది.

36 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే.. టీవీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. 63 సెంటీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలోని ఎల్​​సీడీ టీవీలు కూడా నిబంధనల పరిధిలోకి వస్తాయి.

2019-20లో భారత్​ 781 మిలియన్​ డాలర్ల టీవీ సెట్లను దిగుమతి చేసుకుంది. ఇందులో వియత్నాం, చైనాల వాటానే 428 మిలియన్ డాలర్లు, 293 మిలియన్ డాలర్లుగా ఉంది.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై.. పానసోనిక్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ మనీశ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ కొత్త నిబంధనలతో వినియోగదారులు నాణ్యమైన టీవీసెట్​లు కొనుగోలు చేయగలుగుతారని తెలిపారు. కేంద్ర నిర్ణయం దేశీయ టీవీ కంపెనీలకు కచ్చితంగా మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:కొవిడ్‌ కల్లోలం: భారీస్థాయిలో పడిపోతున్న ఆర్థిక వ్యవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.