ఓలా ఈ-స్కూటర్.. ఆగస్టు 15న మీ ముందుకు

author img

By

Published : Aug 14, 2021, 5:30 PM IST

Ola

ఎలక్ట్రిక్ వాహన విపణిలోకి ప్రవేశించిన ఓలా సంస్థ.. తమ ఎలక్ట్రిక్ స్కూటర్​ను(ఈ- స్కూటర్) స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని విడుదల చేయనుంది. పది రంగుల్లో ఈ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ గురించి మరిన్ని విశేషాలు..

వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ- స్కూటర్) విడుదలకు సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) పురస్కరించుకుని ఆదివారం నుంచి ఇవి మార్కెట్లోకి రానున్నాయి. మొత్తంగా పది రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను ఓలా ఎలక్ట్రిక్ యూట్యూబ్​ ఛానెల్​లో పోస్ట్​ చేసింది. ​

Ola Electric scooter
ఓలా ఈ- స్కూటర్

ఓలా స్కూటర్​ రంగులు ఇలా..

నలుపు (మ్యాట్​, గ్లాస్​ ఫినిషింగ్​)

నీలం (మ్యాట్​, గ్లాస్​ ఫినిషింగ్​)

ఎరుపు

పింక్​

పసుపు

తెలుపు

సిల్వర్​

Ola Electric scooter
ఓలా ఈ- స్కూటర్
Ola Electric scooter
ఓలా ఈ- స్కూటర్

ఓలా స్కూటర్​ గురించి మరిన్ని అంశాలు..

ఓలా స్కూటర్​ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. ప్రాథమిక అంచనాలు ప్రకారం సుమరుగా రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకూ ఉండొచ్చని అంచనా.

జులై 15న ఓలా సంస్థ.. ఈ-స్కూటర్ బుకింగ్స్​ ప్రారంభించింది.​ రిజిస్ట్రేషన్​ ప్రారంభమైన 24 గంటల్లోనే ఈ-స్కూటర్ల​కు లక్ష బుకింగ్​లు రావడం విశేషం.

అడ్వాన్స్​ బుకింగ్ కోసం వినియోగదారుల నుంచి రూ. 499 వసూలు చేసింది ఓలా.

ఆన్​లైన్​ ద్వారా బుక్​ చేసుకున్న వారికి సంస్థ స్కూటర్​లను డోర్​ డెలివరీ ఇవ్వనుంది.

'మేడ్​ ఇన్​ ఇండియా' నుంచి విదేశాలకు ఈ స్కూటర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓలా. ఇందుకు సంబంధించి ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులోని ఓలా ఫ్యూచర్​ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసింది.

మొదటిదశలో భాగంగా ఏడాదికి 20 లక్షల స్కూటర్లను తయారు చేస్తున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య కోటికి చేరవచ్చని అంచనా.

రుణ సదుపాయం కోసం ఓలా ఎలక్ట్రిక్ పదేళ్ల కాలానికి బ్యాంక్​ ఆఫ్​ బరోడాతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ-స్కూటర్ల కోసం దేశవ్యాప్తంగా 400 న‌గ‌రాల్లో లక్ష ఛార్జింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయనుంది ఓలా. ఛార్జింగ్ స్టేష‌న్లను దూర ప్రాంతాల్లో కాకుండా, షాపింగ్ మాల్స్‌, ఐటీ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్స్‌లు, కెఫ్​ల వంటి ప్ర‌దేశాల్లోనే ఏర్పాటు చేయ‌నుంది.

ఓలా స్కూటర్​లో ఇన్‌స్టాలేష‌న్ అవ‌స‌రం లేని హోమ్ ఛార్జ‌ర్ కూడా ఉంటుంది. ఈ ఛార్జర్​తో 18 నిమిషాల్లో 50 శాతానికి పైగా ఛార్జ్​​ చేయవచ్చు. తద్వారా 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

భారత్​లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ తమ ఈ-స్కూటర్లను విక్రయించేందుకు సన్నాహాలు జరుపుతోంది ఓలా.

Ola Electric scooter
ఓలా ఈ- స్కూటర్

ఇదీ చూడండి: ఓలా ఈ- స్కూటర్.. రంగు అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.