ETV Bharat / business

చిప్​ల కొరత- మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి ఢమాల్!

author img

By

Published : Aug 31, 2021, 9:21 PM IST

కార్ల తయారీలో వినియోగించే సెమీకండక్టర్ల కొరత(chip shortage) కారణంగా.. సెప్టెంబర్​లో తమ ఉత్పత్తి 40 శాతానికే పరిమితం కానుందని మారుతీ సుజుకీ(maruti suzuki) అంచనా వేసింది. హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లోని ప్లాంట్లపై ఈ ప్రభావం ఉండనుందని తెలిపింది.

maruti production in september
సెమీ కండక్టర్ల కొరత

ఆటోమొబైల్ రంగాన్ని చిప్​ల కొరత(chip shortage) వేధిస్తోంది. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ(maruti suzuki production news)పై ఈ ప్రభావం ప్రత్యక్షంగా పడింది. సెప్టెంబర్​లో తమ సంస్థ కార్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ప్రకటించింది. హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లోని తమ ప్లాంట్లలో మొత్తం ఉత్పత్తి 40 శాతానికే పరిమితం కానుందని పేర్కొంది.

గురుగ్రామ్​, మనేసర్​లోని సంస్థ ప్లాంట్లలో సంవత్సరానికి 15 లక్షల యూనిట్ల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. అదనంగా సుజుకీ మోటార్ గుజరాత్(జపాన్​కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ విభాగం)కు ఏటా 7.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.

"సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా వాహన ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. హరియాణాతో పాటు గుజరాత్​ ప్లాంట్లలో సెప్టెంబర్​లో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. పరిస్థితి క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత అంచనా ప్రకారం రెండు ప్రాంతాల్లో వాహన ఉత్పత్తి.. సాధారణ ఉత్పత్తిలో 40 శాతానికి పరిమితం అవ్వొచ్చు."

-మారుతీ సుజుకీ ప్రకటన

గతేడాదితో పోలిస్తే జులైలో వాహన ఉత్పత్తి 58 శాతం పెరిగినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. 1,70,719 యూనిట్లు తయారైనట్లు తెలిపింది. ఈ నెలలో హోల్​సేల్ విక్రయాలు 1,62,462 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. గతేడాది జులైతో పోలిస్తే ఇది 50 శాతం అధికమని స్పష్టం చేసింది.

చిప్​లు ఎందుకు?

కంప్యూటర్లు, సెల్​ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే సిలికాన్ చిప్​లనే సెమీకండక్టర్లు అంటారు. వాహనాల్లో ఎలక్ట్రానిక్ ఫీచర్లు పెరిగిపోవడం వల్ల.. తయారీలో సెమీకండక్టర్ల వినియోగం బాగా పెరిగింది. కరోనాతో ఉత్పత్తి పడిపోవడం, సప్లై చైన్​కు విఘాతం కలగడం వల్ల సెమీకండక్టర్ల కొరత(semiconductor shortage) వేధిస్తోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.