Musk divorce: ఆమెతో విడిపోయిన ఎలాన్​ మస్క్​

author img

By

Published : Sep 25, 2021, 1:59 PM IST

Updated : Sep 25, 2021, 3:13 PM IST

musk

దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్​ మస్క్ సింగర్​ గ్రైమ్స్​తో(elon musk grimes) బంధానికి వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని మస్క్​ (Musk news) వెల్లడించారు.

మూడేళ్ల తమ బంధానికి ముగింపు పలికారు బిలియనీర్​ ఎలాన్​ మస్క్​- సింగర్​ గ్రిమ్స్(elon musk grimes)​. ఈ విషయాన్ని మస్క్​ ప్రకటించారు టెస్లా అధినేత.

"మేము విడిపోతున్నాము. కానీ పుర్తిగా విడిపోవడం లేదు. మేము ఇంకా ప్రేమలోనే ఉన్నాము. అప్పుడప్పుడు కలిస్తూ ఉంటాం. మా మధ్య అంతా బాగానే ఉంది. స్పేస్​ఎక్స్​, టెస్లా కోసం నేను ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. అది కూడా టెక్సాస్​కు వెళుతూ ఉండాలి. గ్రిమ్స్​ ఇక్కడ(లాస్​ఏంజెల్స్​) ఉంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గరే ఉంటోంది."

-- ఎలాన్​ మస్క్​, టెస్లా అధినేత.

50ఏళ్ల మస్క్​- 33ఏళ్ల గ్రేమ్స్​కు పుట్టిన తొలి సంతానం పేరు ఎక్స్​ఆయ్​ఎయ్​(2020 మే).(elon musk son name)

అంతకుముందు కెనడాకు చెందిన రచయిత్రి జస్టిన్​ విల్సన్​తో విడాకులు తీసుకున్నారు మస్క్(elon musk wife)​. వారికి ఐదుగురు కుమారులు. ఆ తర్వాత ప్రముఖ స్టార్​ రిలేను రెండుసార్లు వివాహమాడిన మస్క్​.. 2015లో విడిపోయారు. అనంతరం గ్రిమ్స్​తో బంధాన్ని 2018లో బయటపెట్టారు.

బిలియనీర్లే.. కానీ..

బిలియనీర్లు విడాకులు తీసుకుంటున్న వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమ 27ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్​గేట్స్, మెలిందా ఇటీవలే ప్రకటించారు. అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​-మెకాంజీ స్కాట్​ 2019లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ గోల్ఫ్​ ప్లేయర్​ టైగర్​ వుడ్స్​, ఎలిన్​ నోర్డెగ్రెన్​.. 2004లో విహహం చేసుకుని.. ఆరేళ్లకే (2010) విడాకులు తీసుకున్నారు. బాస్కెట్​ బాల్ ప్లేయర్​ మైకెల్​ జోర్డాన్​, జువానిటా వనోయ్ 2006లో విడాకులు తీసుకున్నారు.

ఇదీ చూడండి:- వీరివి అత్యంత ఖరీదైన విడాకులు!

Last Updated :Sep 25, 2021, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.