ETV Bharat / business

రూ.5 లక్షల్లో కొత్త కార్​ కొనాలా? ఇవి చూడండి...

author img

By

Published : Oct 6, 2021, 4:09 PM IST

కొవిడ్‌ అనంతరం ప్రజలు వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా బడ్జెట్‌ ధరలో కార్లకు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు పండగ సీజన్ నేపథ్యంలో పలు కార్ల తయారీ సంస్థలు ఆఫర్లను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రూ.5 లక్షల(ఎక్స్‌షోరూం) బడ్జెట్‌లో మార్కెట్లో ఉన్న కొన్ని కార్లను చూద్దాం!

budget cars
బడ్జెట్ కార్లు

ఇప్పటివరకు బడ్జెట్‌ కార్ల అంటే.. ఆల్టో, వేగనార్‌, శాంత్రో వంటి రెగ్యులర్‌ కార్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. అయితే ఈ మధ్యకాలంలో ఈ చిన్న కార్ల సెగ్మెంట్‌లోకి అత్యాధునిక ఫీచర్లతో అనేక కార్లు వచ్చి చేరాయి. ఇటీవల బడ్జెట్​ కార్లకు గిరాకీ బాగా పెరిగింది. మరోవైపు పండగ సీజన్​.. దీంతో పలు కార్ల తయారీ సంస్థలు ఆఫర్ల ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ఫీచర్లతో రూ.5 లక్షల(ఎక్స్‌షోరూం) బడ్జెట్‌లో కార్లను కొన్నింటిని పరశీలిద్దాం.

datsun redi go
డాట్సన్​ రెడీగో
maruti suzuki s presso
మారుతీ ఎస్​-ప్రెస్సో
tata tiago
టాటా టియాగో
nissan magnite
నిస్సాన్​ మాగ్నైట్​
reno quid
రెనో క్విడ్​
maruti celerio
మారుతీ సెలెరియో
  • వీటితో పాటు, మారుతీ ఈకో, మారుతీ ఇగ్నిస్‌, మారుతీ ఆల్టో, వేగనార్‌, శాంత్రో కూడా రూ.5 లక్షల బడ్జెట్‌లో లభిస్తున్న వాటిలో ఉన్నాయి.
  • పండగ సీజన్ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు క్యాష్‌బ్యాక్‌తో పాటు అనేక రాయితీలు కల్పిస్తున్నాయి. ఆయా స్టోర్లను సంప్రదిస్తే వీటి గురించి మరింత సమాచారం లభిస్తుంది. దీంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
  • ఈ ఏడాది తీవ్ర ఎలక్ట్రానిక్‌ చిప్‌ల కొరత, ముడి సరకు ధరలు పెరగడం వల్ల సంస్థలు ధరల్ని పెంచాయి. పైగా చిప్‌ల కొరత వల్ల డిమాండ్‌కు సరిపడా కార్లను సంస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇదీ చూడండి: పండుగ సీజన్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ అదిరే ఆఫర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.