ETV Bharat / bharat

సీడీఎస్​ బిపిన్‌ రావత్‌ దుర్మరణం- మోదీ సహా ప్రముఖుల నివాళి

author img

By

Published : Dec 8, 2021, 1:30 PM IST

Updated : Dec 8, 2021, 7:57 PM IST

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్​
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్​

19:13 December 08

సీసీఎస్​ భేటీ..

తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన నేపథ్యంలో.. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పాల్గొన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్​ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికతో పాటు మరో 11 మంది సైనికులు చనిపోయారు.

19:00 December 08

ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి..

హెలికాప్టర్‌ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

బిపిన్‌ రావత్‌ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం

ప్రమాదంలో ఆర్మీ సిబ్బంది మృతిపట్ల వెంకయ్యనాయుడు సంతాపం

ప్రమాద ఘటనపై రక్షణ మంత్రితో మాట్లాడా: వెంకయ్యనాయుడు

హెలికాప్టర్‌ ప్రమాదం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

18:53 December 08

కుప్పకూలిన హెలికాప్టర్​

బిపిన్​ రావత్​ ప్రస్థానం..

హెలికాప్టర్‌ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

1958 మార్చి 16న ఉత్తరాఖండ్‌ పౌరీ ప్రాంతంలో జన్మించిన రావత్‌

ఆర్మీలో పనిచేసిన బిపిన్ రావత్‌ తండ్రి లక్ష్మణ్‌సింగ్ రావత్‌

ఆర్మీలో లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయికి ఎదిగిన రావత్‌ తండ్రి

దేహ్రాదూన్​లోని కేంబ్రియన్ హాల్ స్కూల్‌లో చదివిన బిపిన్‌ రావత్‌

షిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్‌ స్కూల్‌లో చదివిన బిపిన్‌ రావత్‌

భారత్‌కు తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌

2019 డిసెంబర్‌ 30న సీడీఎస్‌గా నియమితులైన బిపిన్‌ రావత్‌

బిపిన్‌ రావత్‌ సేవలకు వరించిన పలు పురస్కారాలు

రావత్‌ను పరమ్‌ విశిష్ట్‌ సేవా మెడల్‌తో సత్కరించిన కేంద్రం

రావత్‌కు ఉత్తమ్‌ యుద్ధ సేవ మెడల్‌, అతి విశిష్ట్‌ సేవా మెడల్‌

రావత్‌కు యుద్ధ సేవా మెడల్‌, సేనా మెడల్‌, విశిష్ట్‌ సేవా మెడల్‌

18:37 December 08

గురువారం సాయంత్రంలోగా..

హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక సహా 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా దిల్లీ చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

తమిళనాడులోని కూనూర్​ సమీపంలో సీడీఎస్​ ప్రయాణిస్తున్న చాపర్​ క్రాష్​ అయింది.

18:31 December 08

  • Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et

    — Narendra Modi (@narendramodi) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిపిన్‌ రావత్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య, సైనికుల మరణాలపై సంతాపం ప్రకటించారు.

అత్యంత శ్రద్ధతో వారంతా దేశ సేవ చేశారని కొనియాడారు.

జనరల్​ బిపిన్​ రావత్​.. సీడీఎస్​గా దేశానికి విశేష సేవలందించారని అన్నారు.

''జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు. నిజమైన దేశభక్తుడు. ఆయన మన సాయుధ బలగాలను, భద్రతా యంత్రాంగ ఆధునీకీకరణలో దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

18:27 December 08

రాహుల్​ గాంధీ నివాళి..

జనరల్​ బిపిన్​ రావత్​ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఈ కష్ట సమయంలో.. తమ ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

18:21 December 08

అమిత్​ షా నివాళి..

సీడీఎస్​ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఇదో బాధాకరమైన రోజుగా అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు షా.

18:12 December 08

సీడీఎస్​ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ బిపిన్‌ రావత్‌ దుర్మరణం చెందారు. ఈ మేరకు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది.

ప్రమాద సమయంలో హెలికాప్టర్​లో మొత్తం 14 మంది ఉండగా... వారిలో 13 మంది మరణించారని తెలిపింది. మృతుల్లో బిపిన్ రావత్, ఆయన భార్య ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఈ ఘటనలో గాయపడిన పైలట్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. ప్రస్తుతం వెల్లింగ్టన్​లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది వాయుసేన.

రాజ్​నాథ్​ నివాళి

బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది మరణంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ మరణం.. దేశ సాయుధ దళాలకు తీరని లోటు అని ట్వీట్ చేశారు.

16:49 December 08

హెలికాప్టర్​ ప్రమాదంలో 13 మంది మృతి..

తమిళనాడు కూనూర్​ సమీపంలో జరిగిన ఘోర హెలికాప్టర్​ ప్రమాదంలో 13 మంది చనిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మృతదేహాలను డీఎన్​ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నట్లు తెలిపాయి.

16:14 December 08

రేపే ప్రకటన..!

హెలికాప్టర్ ప్రమాద ఘటనపై పార్లమెంటులో గురువారం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

15:58 December 08

రావత్​ ఇంటికి రాజ్​నాథ్​..

సీడీఎస్​ బిపిన్​ రావత్​ ఇంటికి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెళ్లారు. కాసేపటికే వెనుదిరిగారు.

15:31 December 08

ఐదుగురు మృతి- ఇద్దరి పరిస్థితి విషమం..

తమిళనాడు ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు వివరించారు రాష్ట్ర అటవీశాఖ మంత్రి కె. రామచంద్రన్​. మొత్తం 14 మందిలో ఐదుగురు చనిపోయారని, మరో ఇద్దరు అధికారుల పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

15:27 December 08

సూలూర్​కు వాయుసేన చీఫ్​..

భారత వాయుసేన చీఫ్​ ఎయిర్​ చీఫ్​ మార్షల్​ వీఆర్​ చౌధరి.. సూలూర్​ వైమానిక స్థావరానికి చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

15:19 December 08

రాజ్​నాథ్​ సమీక్ష..

హెలికాప్టర్​ క్రాష్​ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. ఘటనా స్థలంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సంఘటన గురించి రాజ్​నాథ్​ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు.

15:14 December 08

ఐదుకు చేరిన మృతులు..

ఆర్మీ హెలికాప్టర్​ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరినట్లు అధికారులు ప్రకటించారు.

15:05 December 08

ఘటనా స్థలానికి సీఎం స్టాలిన్​..

కోయంబత్తూర్​- సూలూర్​ మధ్య హెలికాప్టర్​ ప్రమాదం జరిగిన నేపథ్యంలో.. సంఘటనా స్థలానికి వెళ్లనున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​. తొలుత చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూర్​ వెళ్లి అక్కడినుంచి నీలగిరికి వెళ్తారు.

14:15 December 08

తమిళనాడులో త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. ప్రమాదంపై ప్రధానికి రాజ్‌నాథ్‌ వివరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంట్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేసే అవకాశముంది. ఈ ఘటనపై వాయుసేన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

14:15 December 08

CDS Bipin Rawat News​, బిపిన్ రావత్​
ఆర్మీ చాపర్​లో ప్రయాణిస్తున్న వారు

ప్రమాద సమయంలో ఆర్మీ చాపర్​లో ఉన్న వారి వివరాలు

  1. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్​
  2. మధులిక రావత్​, DWWA ప్రెసిడెంట్​
  3. బ్రిగెట్​ ఎల్​ఎస్​ లిద్దర్​
  4. లెఫ్టినెంట్ కర్నల్​ హరీందర్ సింగ్​
  5. ఎన్​కే గురుసేవక్ సింగ్​
  6. ఎన్​కే జితేంద్ర కుమార్​
  7. ఎల్​/ఎన్​కే వివేక్​ కుమార్​
  8. ఎల్​/ఎన్​కే బి సాయి తేజ
  9. హావిల్దార్​ సత్పాల్​

14:08 December 08

నాలుగు మృతదేహాలు!

ఆర్మీ హెలికాప్టర్​ కూలిన ప్రదేశంలో నాలుగు మృతదేహాలను గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నాయి.

13:52 December 08

Indian Air Force
భారత వాయుసేన ట్వీట్​

CDS Bipin Rawat News​

ప్రమాదానికి గురైన Mi-17V5 హెలికాప్టర్​లో సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్- ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది.

13:49 December 08

Bipin Rawat Chopper Crash

సహాయక చర్యలు వేగవంతం..

ఘటన సమాచారం అందుకున్న స్థానిక మిలిటరీ అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 80 శాతానికిపైగా కాలిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

13:48 December 08

CDS Bipin Rawat

మిలిటరీ చాపర్​లో 14 మంది!

సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు ఆయన భార్య, డిఫెన్స్​ అసిస్టెంట్​, సెక్యూరిటీ కమాండోలు, ఐఏఎఫ్​ పైలట్లు.. మొత్తం 14 మంది చాపర్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

13:25 December 08

హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్​ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

కుప్పకూలిన హెలికాప్టర్​

Army Chopper Crash: తమిళనాడు కూనూర్​లో ఓ శిక్షణ హెలికాప్టర్​ కుప్పకూలింది. ప్రమాద సమయంలో త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులు ఉన్నారు. ​

ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సూలూర్​ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్​లోని డిఫెన్స్​ సర్వీసెస్​ కాలేజీకి(డీఎస్​సీ) వెళ్తుండగా ​కూనూర్​ సమీపంలో కుప్పకూలింది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలు పడిపోయాయి.

Tamilnadu Army Chopper Crash:

సమాచారం అందిన వెంటనే ఆర్మీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Last Updated :Dec 8, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.