ETV Bharat / bharat

కొడుకు మృతదేహంతో 7 రోజులు ఇంట్లోనే.. దుర్వాసన వస్తున్నా..

author img

By

Published : Sep 29, 2022, 10:38 PM IST

కొడుకు మృతదేహాన్ని ఏడు రోజులపాటు ఇంట్లోనే ఉంచుకుంది ఓ కన్నతల్లి. సమచారం అందుకున్న పోలీసులు.. ఆ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది.

Woman stays with 38-year-old son's body in Bengal's Purulia
Etv Woman stays with 38-year-old son's body in Bengal's Purulia

బంగాల్​లోని పురూలియాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. చనిపోయిన కుమారుడి మృతదేహాన్ని ఏడు రోజులుగా ఇంట్లోనే పెట్టుకుని కూర్చుంది అతడి తల్లి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని శ్యామ్​పురా గ్రామానికి చెందిన సంజయ్​దాస్​(38).. ఏడురోజుల క్రితం చనిపోయాడు. అయినా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా అతడి తల్లి తుసు దాస్​(69).. మృతదేహన్ని ఇంట్లోనే ఉంచుకుంది.

అయితే ఒక్కసారిగా బయటకు దుర్వాసన రావడం వల్ల స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం రాత్రి పోలీసులు సంజయ్​ దాస్​ వెళ్లి చూడగా తలుపులు మూసిఉన్నాయి. వెంటనే తలుపులు పగలుగొట్టి.. పోలీసులు ఇంట్లోకి వెళ్లారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మృతుడి తల్లిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. సంజయ్​ దాస్​ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సంజయ్ అతిగా మద్యం తాగేవాడని స్థానికులు తెలిపారు. అయితే అతడి మృతికి గల కారణాలు పోస్టుమార్టం తర్వాతే తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి: ఆ 67 అశ్లీల వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా.. వెంటనే బ్లాక్​ చేయాలని ఆదేశాలు

కోతులను చెట్టుకు వేలాడదీసిన దుండగులు.. రెండు వానరాలు మృతి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.