ETV Bharat / bharat

'నేను దుర్గాదేవిని.. నా భర్తను వదలండి'.. మహిళ హైడ్రామా.. పోలీస్ స్టేషన్​లో చేతబడి!

author img

By

Published : Jul 9, 2022, 12:54 PM IST

తన భర్తను పోలీసుల చెర నుంచి విడిపించేందుకు ఓ మహిళ హైడ్రామా చేసింది. తాను దుర్గాదేవినని పేర్కొంటూ పోలీసులను తిప్పలు పెట్టింది. స్టేషన్​లోనే చేతబడికి పాల్పడింది.

woman-high-voltage-drama
woman-high-voltage-drama

బిహార్​లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తాను దుర్గాదేవినంటూ మాయమాటలు చెప్పి పోలీసులను ఏమార్చేందుకు విఫలయత్నం చేసింది. స్టేషన్ ముందు చేతబడి చేసింది.
వివరాల్లోకి వెళితే..
జముయీ జిల్లాకు చెందిన ఈ మహిళ పేరు సంజూ దేవి. తాగుడుకు అలవాటుపడ్డ ఆమె భర్త కార్తిక్ మాంఝీ.. పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని ఎలాగైనా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో మహిళ ఈ ప్రయత్నం చేసింది. ఓ చేతిలో కర్ర, మరో చేతిలో బియ్యం పట్టుకొని పోలీస్ స్టేషన్​కు వెళ్లింది సంజూదేవి. 'నేను భక్తురాలిని. నాలో దుర్గామాత ఉంది. నా భర్తను కాపాడుకునేందుకు వచ్చా' అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో అక్కడ హైఓల్టేజ్ డ్రామా నడిచింది.

woman-high-voltage-drama
చేతిలో బియ్యం, మరో చేతిలో కర్రతో మహిళ

ఈ సందర్భంగా వెంట తెచ్చుకున్న కర్రతో గిమ్మిక్కులు చేయడం ప్రారంభించింది ఆ మహిళ. బియ్యం గింజలను పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు అక్కడ ఉన్న అందరి తలలపై విసిరింది. తన ఆదేశాలు లేకుండా ఏదీ జరగదంటూ చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు స్పందించారు. మహిళను లేడీ కానిస్టేబుళ్లు బయటకు తీసుకెళ్లారు. అరెస్టు చేస్తామని హెచ్చరించేసరికి మహిళ శాంతించిందని పోలీసు స్టేషన్ అధికారి జితేంద్ర దేవ్ దీపక్ తెలిపారు.

woman-high-voltage-drama
సంజూదేవి

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.