ETV Bharat / bharat

అత్యాచార బాధితురాలిపై దాడి.. గర్భస్రావం.. చివరికి..

author img

By

Published : Jul 2, 2022, 4:03 PM IST

24 ఏళ్ల గర్భిణీపై నలుగురు దాడి చేయడం వల్ల ఆమెకు గర్భస్రావం అయింది. ఆమెపై అంతకుముందు అత్యాచారానికి పాల్పడిన వారే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

up gang rape
24 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్.. సహరాన్​పుర్​లో దారుణం జరిగింది. గర్భిణీపై నలుగురు వ్యక్తులు దాడి చేయడం వల్ల ఆమెకు గర్భస్రావం అయింది. బాధితురాలు దేవ్​బంద్​​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: జనవరిలో 24 ఏళ్ల మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె తల్లిదండ్రులను చంపేస్తానని, అత్యాచార వీడియోను సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి నిందితుడు బాధితురాలిని లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఓసారి దేవ్​బంద్​లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నిర్భందించి.. అతని ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భవతి అయినప్పుడు నిందితులు చంపడానికి ప్రయత్నించారు. జూన్ 25న ఆమె వారి నుంచి తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. జూన్ 26న నలుగురు నిందితులు మళ్లీ బాధితురాలిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయింది.

ఇవీ చదవండి: ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య.. అదే కారణమా?

గన్​తో ఆడుతూ ట్రిగ్గర్​ నొక్కిన బాలుడు.. రెండేళ్ల చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.