ETV Bharat / bharat

గాల్లో ఉండగా పగిలిన విమాన అద్దం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

author img

By

Published : Jul 20, 2022, 4:29 PM IST

దిల్లీ నుంచి గువాహటి వెళ్తున్న గో-ఫస్ట్​ విమాన అద్దం గాల్లో ఉండగా ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అత్యవసరంగా జైపుర్​ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ చేశారు.

windshield-of-go-firsts-delhi-guwahati-flight-cracks-mid-air-plane-diverted-to-jaipur
windshield-of-go-firsts-delhi-guwahati-flight-cracks-mid-air-plane-diverted-to-jaipur

దిల్లీ నుంచి గువాహటి వెళ్తున్న గో-ఫస్ట్​ విమానం అత్యవసరంగా జైపుర్ విమానాశ్రయంలో ల్యాండ్​ అయింది. విమానం గాల్లో ఉండగా.. విండ్​ షీల్ట్​ పగలిపోవడం వల్ల అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చిందని​ డీజీసీఏ అధికారులు తెలిపారు.

రెండు రోజుల్లో మూడు.. గత రెండు రోజుల్లో గో-ఫస్ట్​ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది మూడో సారి. మంగళవారం.. ముంబయి నుంచి లేహ్ వెళ్తున్న విమానంలో ఇంజిన్​లో సమస్య తలెత్తడం వల్ల అత్యవసరంగా దిల్లీ ఎయిర్​పోర్ట్​కు దారి మళ్లించారు అధికారులు. అదే రోజు శ్రీనగర్​-దిల్లీ ఫ్లైట్​లోనూ ఇంజిన్​లోనే సాంకేతిక లోపాలు బయపడటం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు.

ఇవీ చదవండి: స్పైస్​జెట్ విమానంలో పొగలు.. 5వేల అడుగుల ఎత్తులో.. కానీ లక్కీగా..

హడావుడిగా పాక్​లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్​కు​ వస్తుండగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.