ETV Bharat / bharat

జెండా ఎగురవేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసా

author img

By

Published : Aug 14, 2022, 2:09 PM IST

దేశప్రజలందరికీ గర్వకారణమైన త్రివర్ణ పతాకం ఎగురవేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా చట్టంలో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. మరి జెండా ఎలా ఎగురవేయాలి, ఆ నిబంధనలు ఏంటి. ఓసారి తెలుసుకుందాం.

What are the rules of hoisting national flag
What are the rules of hoisting national flag

Flag code of India: భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్ధతను శ్రద్ధాసక్తులతో నిర్వహించడం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేస్తున్నారు. ప్రస్తుతం ఇంటింటా తిరంగ కార్యక్రమంలో భాగంగా అందరూ తమ ఇళ్లపై జెండాలు ఎగురవేస్తున్నారు. అయితే, జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు పాల్పడకూడదు. అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హం అవుతుంది. అందుకే జెండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జాతీయ జెండా ఎగురవేయడానికి సంబంధించి.. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా చట్టం ప్రకారం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు.

  • జాతీయ జెండా ఎగురవేసినప్పుడు కాషాయ వర్ణం పైకి వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి
  • జెండాను పై నుంచి కిందికి వేలాడదీయకూడదు
  • పతాకానికి సమానంగా గానీ, ఇంకా ఎత్తులో గానీ ఏ ఇతర జెండా ఎగురకూడదు
  • జెండాపై ఏదైనా రాయడం, తయారు చేయడం, జెండా నుంచి ఏదైనా తొలగించడం చట్ట విరుద్ధం
  • జాతీయ పతాకాన్ని ఏ వస్తువులను, భవనాలను మొదలైన వాటిని కవర్‌ చేయడానికి ఉపయోగించకూడదు
  • ఉద్దేశపూర్వకంగా నేలపై లేదా నీటిలో, కాలిబాటలో వేయరాదు
  • యూనిఫాం, అలంకరణ కోసం ఉపయోగించకూడదు
  • హాని కలిగించే విధంగా దానిని ప్రదర్శించకూడదు, కట్టకూడదు.
  • పోల్‌కు చిట్ట చివరనే ఎగురవేయాలి, సగం కిందకు దించి ఎగురవేయకూడదు
  • దెబ్బతిన్న, చెదిరిన జెండాను ప్రదర్శించకూడదు.
  • ఫ్లాగ్‌ కోడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష కూడా విధించవచ్చు.
  • త్రివర్ణ పతాకం జాతీయ గౌరవానికి చిహ్నం. దానిని వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు. ముఖ్యంగా జెండాపై అగౌరవాన్ని వ్యక్తం చేయకూడదు.

త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ పత్తి, పట్టు లేదా ఖాదీతో తయారు చేసినదై ఉండాలి, ప్లాస్టిక్‌ జెండాలను తయారు చేయడం నిషేధం. త్రివర్ణ నిర్మాణం ఎల్లప్పుడూ దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. దీని నిష్పత్తి 3:2 గా నిర్ణయించారు. అదే సమయంలో తెల్లని బ్యాండ్‌ మధ్యలో ఉన్న అశోకచక్రంలో 24 ప్లీహములు కలిగి ఉండటం అవసరం. దేశంలో మూడు చోట్ల మాత్రమే 21, 14 అడుగుల జాతీయ జెండాలను ఎగురవేస్తారు. ఈ ప్రదేశాలు: కర్ణాటకంలోని నర్గుండ్‌ కోట, మహారాష్ట్రంలోని పన్హాలా కోల, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో ఉన్న కోట.

ఇంటి పైకప్పు పైనా
ఇంతకుముందు సామాన్య ప్రజలు తమ ఇళ్లలో లేదా సంస్థల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అనుమతి ఉండేది కాదు. రాత్రి సమయంలో జెండా ఎగురవేయడం నిషేధించారు. 22 డిసెంబర్‌ 2002 తర్వాత సామాన్య ప్రజలు తమ ఇళ్లు లేదా కార్యాలయాల్లో జెండా ఎగురవేయడానికి అనుమతి లభించింది. వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేప్పుడు.. జెండా ఎగురవేసే వ్యక్తి ముఖం ప్రేక్షకుల వైపు ఉంటే.. త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ అతని కుడి వైపున ఉండాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.