UPSC Civils: సివిల్స్ 2022 తుది ఫలితాలు విడుదల.. మెరిసిన తెలుగు తేజాలు...

author img

By

Published : May 23, 2023, 2:33 PM IST

Updated : May 23, 2023, 3:19 PM IST

UPSC Civils Final result
సివిల్స్ 2022 తుది ఫలితాలు విడుదల ()

14:27 May 23

సివిల్స్‌లో యూపీకి చెందిన ఇషితా కిశోర్‌కు ప్రథమర్యాంకు

UPSC Civils Final result: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ 2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, మంది అర్హత సాధించారు. వివిధ పోస్టుల వారీగా పరిశీలస్తే ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది ఎంపిక కాగా.. ఐఎఫ్‌ఎస్‌కు 38 మందిని ఎంపిక చేశారు. ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. ఇందులో సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ - ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది.

అదరగొట్టిన అమ్మాయిలు: టాప్‌ 4 ర్యాంకుల్లోనూ అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. యూపీఎస్సీ వెల్లడించిన ఫలితాల్లో మెుదటి నాలుగు ర్యాంకులను అమ్మాయిలే సాధించిడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇషితా కిశోర్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్‌. స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో మెరిశారు.

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు: తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సివిల్స్‌లో సత్తా చాటారు. తిరుపతికి జిల్లాకు చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాఖమూరి శ్రీసాయి అర్షిత్‌ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200, రావుల జయసింహారెడ్డి 217, బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్‌.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్‌ 362, యప్పలపల్లి సుష్మిత 384, సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సత్తా చాటారు.

ఇవీ చదవండి:

Last Updated :May 23, 2023, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.