ETV Bharat / bharat

శోభకృత్ నామ సంవత్సరం.. మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి

author img

By

Published : Mar 22, 2023, 4:18 PM IST

Updated : Mar 22, 2023, 6:51 PM IST

UGADI HOROSCOPE 2023: ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఈ సంవత్సర కాలంలో తమ రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం శోభకృత్ నామ సంవత్సరంలో 12 రాశుల వారి సంవత్సర ఫలాల గురించి తెలుసుకోండి...

ugadi
UGADI HOROSCOPE 2023

UGADI HOROSCOPE 2023 : తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాది నాడు చాలా మంది పంచాంగ శ్రవణం తప్పక వింటారు. చాలా మందికి తమ రాశి ఎలా ఉంది అనే ఉత్సుకత ఉంటుంది. శ్రీ శోభకృత్​ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి సంవత్సర ఫలాల గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఏమన్నారంటే?

.
మేషరాశి

ఆదాయం 5; వ్యయం 5 రాజపూజ్యం 3; అవమానం 1
ఈ రాశివారికి ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. మంచి పనులకై ధనాన్ని వెచ్చిస్తారు. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి.

.
వృషభరాశి

ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1
విశేషమైన ఆదాయం ఉంది. పెట్టుబడి ప్రయత్నాలు సఫలమవుతాయి. అదృష్టయోగం 75శాతం బాగుంది. చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులకు విశేషమైన విద్యాయోగం, ఉద్యోగులకు అధికార లాభం ఉంటాయి.

.
మిథునరాశి

ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కష్టపడి పనిచేయాలి. అదృష్టయోగం 50శాతం బాగుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో అధికార యోగం ఉంది.

.
కర్కాటకరాశి

ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4
బ్రహ్మాండమైన ఆర్థికస్థితి గోచరిస్తోంది. అదృష్టయోగం 75శాతం బాగుంది. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి. వ్యాపారం బాగుంటుంది. పెట్టుబడులు వృద్ధిచెందుతాయి.

.
సింహరాశి

ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7
అద్భుతమైన ధనయోగం సూచితం. అదృష్టయోగం 50శాతం ఉంది. ఏప్రిల్‌ 22 తర్వాత గురు బలం వల్ల విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితముంది.

.
కన్యారాశి

ఆదాయం 2 వ్యయం 11 రాజపూజ్యం 4 అవమానం 7
ఖర్చు విషయంలో జాగ్రత్తపడాలి. సౌమ్యంగా సంభాషించాలి. అదృష్టయోగం 50శాతం బాగుంది. ఏప్రిల్‌ 22వరకు గురుబలం వల్ల ఎదురుచూస్తున్న పనుల్లో మంచి జరుగుతుంది.

.
తులా రాశి

ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7
ధర్మమార్గంలో ఆర్థికవృద్ధి సూచితం. స్థిరాస్తులకై ధనాన్ని వెచ్చిస్తారు. అదృష్టయోగం 50శాతం బాగుంది. విద్యలో రాణిస్తారు. ఉద్యోగపరంగా శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి.

.
వృశ్చిక రాశి

ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3
విశేషమైన కృషిచేయాలి. అదృష్టయోగం 75శాతం బాగుంది.సంకల్పం సిద్ధిస్తుంది. కాలం సహకరిస్తుంది. ఏప్రిల్‌ 22వరకు విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు.

.
ధనస్సు రాశి

ఆదాయం 8; వ్యయం 11 రాజపూజ్యం 6; అవమానం 3
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మీ ప్రతిభను గుర్తించి ఆదరించేవారు పెరుగుతారు. అదృష్టయోగం 75 శాతం బాగుంది. అనుకున్నది సాధిస్తారు.

.
మకర రాశి

ఆదాయం 11; వ్యయం 5 రాజపూజ్యం 2; అవమానం 6
ధనయోగం సూచితం. స్థిరాస్తులు వృద్ధిచెందుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. అదృష్టయోగం 50శాతం బాగుంది. పట్టుదలగా పనిచేస్తే గ్రహబలం సహకరిస్తుంది.

.
కుంభరాశి

ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 5; అవమానం 6
అద్భుతమైన ధనలాభాలుంటాయి. స్థిర చరాస్తులు వృద్ధిచెందుతాయి. అదృష్టయోగం 50శాతం బాగుంది. పనులు వాయిదా వేయకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి.

.
మీనరాశి

ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2
భూగృహవాహనాది యోగాలను పొందే క్రమంలో రుణసమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి.

Last Updated : Mar 22, 2023, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.