ETV Bharat / bharat

Twitter Posts on Chandrababu Naidu Arrest : ఈ అరాచకాలు.. ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు.. మౌనం వెనక ప్రళయం ఉంది.. గుర్తుపెట్టుకో జగన్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 4:56 PM IST

Chandrababu Naidu Arrest News Updates : పాలకుడు అవినీతిపరుడైతే.. నీతిమంతులు జైలు పాలవుతారని ఆనాడు డాక్టర్​ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈనాడు అదే నిజమైంది. 14 సంవత్సరాలు సీఎంగా చేసి.. 9 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపిన మహా నేత నారా చంద్రబాబు నాయుడును రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్టు చేశారు. ప్రస్తుతానికి చంద్రబాబు అరెస్ట్​పై ట్విటర్​లో పలు ట్యాగ్​లు ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం..

Twitter Posts on Chandrababu Naidu Arrest
Chandrababu Naidu Arrest

Chandrababu Naidu Arrest News Updates : ఒక హుద్ హుద్, ఒక తిత్లీ తుపాన్​.. ఇప్పుడు ఈ సైకో తుపాన్.. సంక్షోభం ఏదైనా తన స్టైల్​లో అక్కడి నుంచే అవకాశాలను సృష్టించుకోవడం కేవలం ఈ నవ ఆంధ్ర నిర్మాతకే తెలుసు. ఈ నాలుగున్నర ఏళ్ల పాలనలో ఆ దార్శనికుడు చేసిన అభివృద్ధిలోనే కదా మూలుగుతూ ఉన్నాం. ఏనాడైనా నీకంటూ ప్రత్యేకమైంది.. ఇది కట్టానంటూ చేసి నిరూపించావా జగన్​ మామయ్య.. ఈనాడు నీవు చేసిన చంద్రన్న అరెస్టుతో ట్విటర్​లో ట్రెండింగ్​లో ఉన్నది మన రాష్ట్రమే.. ఆ విషయం మీకు తెలుసా..?

  • ఆయనకేం తక్కువ? ఆయనకేం అవసరం? ఎందుకోసం ఆయన పోరాడాలి? ఎవరి కోసం ఈ వయసులో ఇన్ని కష్టాలు అనుభవించాలి? పెళ్లిరోజు కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన ఆయన, నిద్రాహారాలు లేకుండా కోర్టులో ఎందుకు ఉండాలి? ప్రజలారా ఆలోచించండి.#FalseCasesAgainstNaidu#SelfGoalByJagan pic.twitter.com/YvlLsiDnUa

    — Telugu Desam Party (@JaiTDP) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrababu Arrest News : 'ఏనాడైనా రాష్ట్రంలో అభివృద్ధి అనే మంత్రం జపించావా..? ఎప్పుడూ రివెంజ్​ రాజకీయాలతోనే సమయం మొత్తం వెల్లదీస్తున్నావు కదా. రోజులెప్పుడూ ఓకేలా ఉండవ్ జగన్ మామయ్య. ఆయన మూడెళ్ల పొద్దు సెప్పినాడు.. మీకు భగవద్గీత గట్టిగా వినిపిస్తాడు చూడు. 3.8 లక్షల మంది నిరుద్యోగులకు చదువు చెప్పినందుకు.. దాని ద్వారా 64 వేల మందికి ఉద్యోగాలు వచ్చినందుకు అరెస్ట్ చేశారా..? మీరు చంద్రబాబును అరెస్టు చేస్తే ఏమైనా గెలిచాం అనుకుంటున్నారా..? ప్రజలు బాగుపడితే జగన్ పాలన చూడలేకపోతుంది. ఇది పోలీసులు చెయ్యాల్సిన పనేనా..? గొంతు మీద కాలు పెట్టి ఏమీ చేయని ప్రజలను చంపేద్దాం అనుకుంటున్నారా..? చేయని తప్పుకు చంద్రబాబును ఇలా ముద్దాయిలాగా కూర్చోబెట్టి, విదేశాల్లో ఉండి దీన్ని చూస్తూ.. 'సైకో జగన్'​ ఆనందం పొందుతూ ఉండొచ్చు. జగన్ ​రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో.. పైన భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. అంతకు రెండింతలు నువ్వూ అనుభవిస్తావ్​ గుర్తుపెట్టుకో' అంటూ ట్విటర్​లో జగన్​పై పలువురు విరుచుకుపడుతున్నారు.

  • 3.8 లక్షల మంది నిరుద్యోగులకి చదువు చెప్పినందుకు.. దాని ద్వారా 64వేల మందికి ఉద్యోగాలు వచ్చినందుకు అరెస్ట్ చేసారు..
    ప్రజలు బాగుపడితే జగన్ గాడు చూడలేడు కదా 😡😡#FalseCasesAgainstNaidu#SelfGoalByJagan pic.twitter.com/jZwlLCvEyB

    — 𝓑𝓱ã𝓻â𝓽𝓱 𝓖ö𝓵𝓵à (@BharathGolla) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Pattabhi Questioned Sakshi Media in SIT Office: చంద్రబాబు విచారణ గదిలో బ్లూ మీడియా.. వారికి ఎలా అనుమతించారు?

TDP Chief Nara Chandrababu Naidu Arrest : ఈ క్రమంలోనే ట్విటర్​లో కొన్ని ట్యాగ్​లు ట్రెండింగ్​లో ఉన్నాయి. 'సెల్ఫ్ గోల్​ బై జగన్'(SelfGoalbyJagan), 'వీ స్టాండ్ విత్ సీబీఎన్ సార్' (WeStandWithCBNSir), 'ఫాల్స్ కేసెస్ ఎగైనెస్ట్ నాయుడు'(FalseCasesAgainstNaidu) అంటూ ట్విటర్​లో ట్యాగ్​లు ట్రెండ్​ అవుతున్నాయి. ఈ ట్యాగ్​లతో ఏపీ ప్రజలు జగన్​ అరాచక పాలనపై భగ్గుమంటూ.. పోస్ట్​లు పెడుతూ సోషల్ మీడియాలో షేర్​ చేస్తున్నారు.

Twitter Posts on Chandrababu Naidu Arrest : చంద్రబాబును అరెస్టు చేయాలంటే ఆయనతో పాటు కొన్ని లక్షల మందిని అరెస్టు చేయాలని.. రాష్ట్ర ప్రజానీకం రోడ్ల మీదకు వచ్చింది. రాష్ట్ర ప్రజలందరినీ అరెస్టు చేయాలంటే.. ఏపీలో ఉన్న జైళ్లతో పాటు నీ తాడేపల్లి ప్యాలెస్ కూడా సరిపోదు అని మండిపడుతున్నారు. 'నువ్వు అవినీతి చేసినట్టు.. అందరూ చేస్తారనుకోవడం మీ అవివేకమే జగన్​మోహన్​రెడ్డి' వైసీపీ చేసే తప్పుల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారు. నిప్పులాంటి మనిషిని మీరేదో చేయాలనుకోవడం అది మీ అవివేకమే అవుతుంది జగన్ అంటూ ట్విటర్​లో పోస్ట్​లు పెడుతున్నారు.

  • చంద్రబాబు గారి లాయర్లు అడిగితే అనుమతి ఇవ్వరు కానీ, దొంగ సాక్షి ఛానల్ కూలీలని లోపలకు ఎలా అనుమతి ఇస్తారు? అది సిఐడినా? జగన్ ఇంట్లో ఉద్యోగులా?#FalseCasesAgainstNaidu#SelfGoalByJagan pic.twitter.com/ly00Yyyb5Y

    — Telugu Desam Party (@JaiTDP) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP Governer on Chandrababu Arrest చంద్రబాబు అరెస్టుపై సమాచారం ఇవ్వకపోవటంపై గవర్నర్‌ విస్మయం ? టీడీపీ నేతలతో భేటీకి అపాయింట్​మెంట్..!

AP People Twitter Comments on CBN Arrest : మరోవైపు చంద్రబాబు అరెస్టును జోహో సంస్థ సీఈవో శ్రీధర్ వెంబు ట్విటర్​ వేదికగా ఖండించారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలను చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చారని అన్నారు. న్యాయం తప్పక గెలుస్తుందని శ్రీధర్ వెంబు ఆశాభావం వ్యక్తం చేశారు.

గృహ నిర్భంధం పేరుతో ప్రతిపక్ష నేతలను నియోజకవర్గంలో తిరక్కుండా, ప్రజలను కలవకుండా, చట్ట విరుద్ధంగా ఇళ్లలోకి వచ్చి ప్రతిరోజూ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని నిరంకుశ పాలన చేస్తున్న జగన్ పని అయిపోయిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. 'బై బై జగన్' ఇదేనా నీ పాలన అంటూ పోస్ట్​లు షేర్ చేస్తున్నారు. విశాఖలో గృహ నిర్భంధాలు కొనసాగుతున్నాయి. టీడీపీ వంగలపూడి అనిత ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. అనుమతి లేకుండా ఇంట్లోకి ఎలా వస్తారు? ఎందుకు వస్తారంటూ వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బయట ఉండమని గేటుకి తాళం వేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రతీదీ కుట్రపూరిత ప్రవర్తనకు సాక్ష్యంగా నిలిచింది. కానీ.. ఆయన ఎక్కడా భయపడలేదు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఇబ్బంది పెట్టినా సరే.. ఎక్కడా తొణకలేదు.. బెదరలేదు.

TDP Chief Nara Chandrababu Naidu Arrest: ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు

Chandrababu Naidu Arrest : చంద్రబాబుకు అనారోగ్యం.. అయినా ఆగని అరెస్టు.. జగన్‌ సైకో పాలనపై నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.