ETV Bharat / bharat

'స్పైడర్ మ్యాన్' సాహసాలతో వరుస చోరీలు.. అడ్డంగా కెమెరాకు చిక్కి..!

author img

By

Published : Jun 4, 2022, 11:52 AM IST

Spider Man Thief: స్పైడర్​ మ్యాన్​లా​ సాహసాలు చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగ.. మంగళవారం రాత్రి కూడా అదే రీతిలో ఓ ఇంట్లోకి దూరి పనికానిచ్చేశాడు. కానీ, అక్కడ సీసీకెమెరాలు ఉన్న విషయం చూసుకోలేదు. దీంతో అడ్డంగా కెమెరాలకు చిక్కాడు. బాధితులు సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

'స్పైడర్​ మ్యాన్' దొంగ
'స్పైడర్​ మ్యాన్' దొంగ

'స్పైడర్ మ్యాన్' సాహసాలతో వరుస చోరీలు.. అడ్డంగా కెమెరాకు చిక్కి..!

Spider Man Thief: దేశ రాజధాని దిల్లీలో ఓ యువకుడు.. స్పైడర్​ మ్యాన్ చేసిన​ సాహసాలను స్ఫూర్తిగా తీసుకున్నాడు. అయితే ఆ స్పైడర్ ​మ్యాన్​ మనుషుల ప్రాణాలు కాపాడితే.. ఈ యువకుడు మాత్రం ఆ సాహసాలే చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. అచ్చం స్పైడర్​ మ్యాన్​లాగే పెద్ద పెద్ద భవనాలపైకి పాకుతూ విలువైన వస్తువులను దోచుకుంటున్నాడు. ఆ రీతిలోనే మే 31న ఖజూరీ ఖాస్​ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, మొబైల్​ ఫోన్​ను దోచుకుని విద్యుత్​ తీగ సాయంతో దిగి పారిపోయాడు.

'స్పైడర్​ మ్యాన్' దొంగ
'స్పైడర్​ మ్యాన్' దొంగ

దొంగతనాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు కానీ ఆ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను గుర్తించలేదు. దీంతో అడ్డంగా బుక్కయ్యాడు ఆ 'స్పైడర్​ మ్యాన్'​ దొంగ. సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ దొంగ మొదట ఇంటి బయట పార్క్​ చేసిన కారుపైకి ఎక్కి.. ఆపై విద్యుత్​ తీగల సహాయంతో ఇంట్లోకి చొరబడి దోచుకెళ్లాడు. ఇక, పోలీసులు ఆ దొంగ కోసం గాలిస్తున్నారు.

''మే31న అర్థరాత్రి మా ఇంట్లోకి దొంగతనం జరిగింది. బీరువాలో ఉన్న బంగారు వస్తువులు, గొలుసు, ఉంగరాలు, మొబైల్ తదితర వస్తువులను ఎత్తుకెళ్లాడు. అర్ధరాత్రి నీటికోసం లేచిన మా అమ్మ కాలి చప్పుడు విని పారిపోయాడు. సీసీఫుటేజ్​ల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాం.''

-- సురేంద్రసింగ్​, బాధితుడు

ఇవీ చదవండి: దేశంలో తొలి మిర్రర్ టెలిస్కోపు.. ఆసియాలోనే పెద్దది.. ప్రపంచంలో ప్రథమం!

దేశంలో తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.