ETV Bharat / bharat

Avinash Inquiry: అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట

author img

By

Published : Apr 18, 2023, 12:42 PM IST

Updated : Apr 18, 2023, 4:54 PM IST

avinash
avinash

16:51 April 18

అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట

  • అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
  • ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు
  • ఈ నెల 25 వరకు అవినాష్ ప్రతిరోజు సీబీఐ విచారణకు హాజరుకావాలి: హైకోర్టు
  • అవినాష్ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలి: హైకోర్టు
  • అవినాష్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 25న తుది తీర్పు ఇస్తాం: హైకోర్టు

16:34 April 18

భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిపి అవినాష్‌ను ప్రశ్నిస్తామన్న సీబీఐ

  • అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
  • కాసేపట్లో తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు

16:31 April 18

వివేకా హత్య కేసులో నిందితుల కస్టడీకి అనుమతి

  • వివేకా హత్య కేసులో నిందితుల కస్టడీకి అనుమతి
  • భాస్కర్ రెడ్డి, ఉదయకుమార్‌ రెడ్డిని 6 రోజుల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతి
  • రేపట్నుంచి 6 రోజులపాటు కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ అధికారులు
  • భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలో కలిపి అవినాష్ ను విచారిస్తామన్న సీబీఐ

16:02 April 18

అవినాష్‌రెడ్డి చాలా ప్రభావం చేయగల వ్యక్తి: సీబీఐ

  • వివేకా హత్య కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది: సీబీఐ న్యాయవాది
  • అవినాష్‌రెడ్డి చాలా ప్రభావం చేయగల వ్యక్తి: సీబీఐ న్యాయవాది
  • ఆర్థిక, వివాహేతర సంబంధాలపై ఆధారాలు లేవు: సీబీఐ న్యాయవాది
  • హత్యకు ఉపయోగించిన ఆయుధం రికవరీ కాలేదు: సీబీఐ న్యాయవాది
  • హత్య తర్వాత నిందితుడు ఆయుధంతో అవినాష్ ఇంటికి వెళ్లాడు: సీబీఐ

15:50 April 18

నేటి విచారణపై స్పష్టత ఇవ్వాలని కోరిన అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది

  • నేటి విచారణపై స్పష్టత ఇవ్వాలని కోరిన అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది
  • సాయంత్రం విచారణకు వెళ్లేందుకు అవినాష్‌ సిద్ధంగా ఉన్నారన్న న్యాయవాది
  • అవినాష్‌రెడ్డిని విచారణ కోసం రేపు పిలుస్తాం: సీబీఐ
  • రేపు ఉదయం 10.30కు రమ్మంటామని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
  • హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు విచారిస్తామన్న సీబీఐ
  • సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టుకు వస్తున్నారు: సునీత
  • అవినాష్ ప్రమేయంపై నిందితులు, సాక్షులు సీబీఐకి చెప్పారు: సునీత
  • అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు
  • దస్తగిరి వాంగ్మూలం మినహా నాపై ఎలాంటి ఆధారాలు లేవు: అవినాష్ రెడ్డి
  • దర్యాప్తులో గూగుల్ టేకౌట్ డేటాపై ఆధారపడటం తగదు: అవినాష్ రెడ్డి
  • సునీల్ కదలికలపై దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ డేటా విరుద్ధంగా ఉన్నాయి: అవినాష్
  • దస్తగిరి చెప్పింది తప్పా?, గూగుల్ డేటా తప్పా?: అవినాష్ రెడ్డి
  • వివేకా హత్యకు కుటుంబ, వివాహేతర, ఆర్థిక వివాదాలు కారణమై ఉండొచ్చు: అవినాష్

15:39 April 18

అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా

  • అవినాష్‌రెడ్డిని విచారణ కోసం రేపు పిలుస్తాం: సీబీఐ
  • రేపు ఉదయం 10.30కు రమ్మంటామని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
  • ఇవాళ సాయంత్రం 4 గం.కు జరగాల్సిన సీబీఐ విచారణ రేపటికి వాయిదా
  • హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు విచారిస్తామన్న సీబీఐ

14:52 April 18

అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ప్రారంభమైన వాదనలు

  • అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మళ్లీ వాదనలు ప్రారంభం
  • తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • సునీత తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్

14:39 April 18

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ

  • వైఎస్‌ అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ
  • భోజన విరామం తర్వాత తెలంగాణ హైకోర్టులో మళ్లీ వాదనలు

13:55 April 18

హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలి: సీబీఐ

  • వైఎస్‌ అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
  • విచారణ మధ్యాహ్నం 2.30 గం.కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
  • అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించిన సీబీఐ
  • అవినాష్‌ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉంది: సీబీఐ
  • గతంలో నాలుగు విచారణల్లో అవినాష్ సహకరించలేదు: సీబీఐ
  • వివేకా హత్య కుట్ర వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలుసు: సీబీఐ
  • దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించాం: సీబీఐ
  • హత్యకు ముందు, తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్, ఉదయ్ ఉన్నారు: సీబీఐ
  • హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలి: సీబీఐ
  • అవినాష్ జమ్మలమడుగుకు వెళ్లే మార్గంలో ఉన్నట్లు చెప్పారు: సీబీఐ
  • మొబైల్ సిగ్నల్స్ చూస్తే అవినాష్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది: సీబీఐ
  • అవినాష్ రాత్రంతా ఫోన్‌ను అసాధారణంగా వినియోగించినట్లు గుర్తించాం: సీబీఐ
  • సునీత తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు

13:36 April 18

వైఎస్‌ అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • వైఎస్‌ అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
  • మధ్యాహ్నం 2.30 గం.కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

13:30 April 18

అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించిన సీబీఐ

  • అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
  • అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించిన సీబీఐ
  • అవినాష్‌ను విచారించి అనేక విషయాలు తీసుకోవాల్సి ఉంది: సీబీఐ
  • గతంలో నాలుగు విచారణల్లో అవినాష్ సహకరించలేదు: సీబీఐ
  • వివేకా హత్య కుట్ర వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలుసు: సీబీఐ
  • దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించాం: సీబీఐ
  • హత్యకు ముందు, తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్, ఉదయ్ ఉన్నారు: సీబీఐ
  • హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలి: సీబీఐ

13:05 April 18

అవినాష్‌ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

  • ఎంపీ అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై విచారణ ప్రారంభం
  • వివేకా హత్య కేసులో అవినాష్‌కు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
  • అవినాష్‌ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
  • పిటిషన్‌ తేలేవరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని వినతి
  • అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీబీఐని ఆదేశించాలని వినతి

12:26 April 18

ఎంపీ అవినాష్‌ ముందస్తు బెయిల్​ పిటిషన్‌

  • కడప ఎంపీ అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ
  • తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
  • పిటిషన్‌ తేలేవరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని వినతి
  • అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీబీఐని ఆదేశించాలని వినతి
  • అవినాష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలంటున్న సీబీఐ
  • ఈ నెలాఖరు నాటికి దర్యాప్తు పూర్తిచేయాల్సి ఉందని సీబీఐ వివరణ
  • కేసులో పలు సాక్ష్యాలు సేకరించామని వెల్లడించిన దర్యాప్తు సంస్థ
  • కుట్రలో అవినాష్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు భావిస్తున్నామని సీబీఐ స్పష్టీకరణ
  • అవినాష్‌ సమక్షంలోనే హత్యాస్థలిలో సాక్ష్యాలను చెరిపేశారని వెల్లడి
  • అవినాష్‌, సీబీఐ తరఫున తెలంగాణ హైకోర్టులో ఇవాళ కూడా వాదనలు
  • పిటిషన్‌లో ఇంప్లీడ్ అయిన సునీత తరఫు వాదనలు విననున్న హైకోర్టు
  • అవినాష్‌, సీబీఐ, సునీత వాదనలు విన్నాక నిర్ణయాన్ని వెల్లడించనున్న కోర్టు
  • అవినాష్‌ను సా. 4 గం.కు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు సూచన
  • వైఎస్‌ అవినాష్‌ను సాయంత్రం 4 గం.కు విచారించేందుకు సీబీఐ అంగీకారం
  • అవినాష్‌ను నేడు విచారిస్తామని.. అవసరమైతే అరెస్టు చేస్తామన్న సీబీఐ
Last Updated :Apr 18, 2023, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.