కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించలేం.. అవినాష్ పిటిషన్ కొట్టివేత
Published: Mar 17, 2023, 11:00 AM


కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించలేం.. అవినాష్ పిటిషన్ కొట్టివేత
Published: Mar 17, 2023, 11:00 AM
TELANGANA HIGH COURT DISMISSED THE AVINASH PETITION: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను కొట్టివేస్తూ.. దర్యాప్తు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
TELANGANA HIGH COURT DISMISSED THE AVINASH PETITION: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. అవినాష్‌పై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు నిరాకరించింది. తదుపరి సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు కొనసాగివచ్చని సీబీఐకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అవినాష్ రెడ్డిని విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణ సమయంలో న్యాయవాదని అనుమతించాలన్న అవినాష్ అభ్యర్థనను తోసిపుచ్చింది. విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమన్న న్యాయస్థానం.. అవినాష్ రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని సీబీఐకి సూచించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ చేస్తున్న దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ నెల 9న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తన విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని.. సీబీఐ అధికారులు నమోదు చేసిన తన వాంగ్మూలం ప్రతికి తనకు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా సీబీఐ విచారణ జరుపుతున్న సమయంలో వీడియో, ఆడియో రికార్డింగ్ కూడా చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని, వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్‌రెడ్డి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే అవినాష్ రెడ్డి అభ్యర్థనపై స్పందించిన సీబీఐ అధికారులు.. ఆడియో, వీడియో రికార్డులు కూడా ఉన్నాయని హైకోర్టుకు వెల్లడించారు. అవినాష్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై ఈ నెల 13న వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఈరోజుకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై తీర్పు వెల్లడించే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐ అధికారులను ఆదేశించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే పలు సార్లు విచారణకు హాజరయ్యారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24, మూడో సారి మార్చి 14న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. తాజాగా అవినాష్ దాఖలు చేసిన మధ్యంతర ఉత్తర్వులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్‌ను కొట్టివేస్తూ.. సీబీఐని దర్యాప్తు చేసుకోవాలని ఆదేశించింది. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు నిరాకరించింది. తదుపరి సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అవినాష్ రెడ్డిని విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి:
- 'ఫ్రెడ్డీ' తుపాను బీభత్సం.. 300 మంది బలి.. తీవ్ర ఇబ్బందుల్లో మహిళలు!
- కార్పొరేషన్లతో ప్రభుత్వం మాయాజాలం.. అప్పులు, వ్యయాల ప్రస్తావన లేకుండానే బడ్జెట్ లెక్కలు
