ETV Bharat / bharat

టీచర్​కు కరోనా- స్కూల్​ మూసేసిన అధికారులు!

author img

By

Published : Dec 24, 2021, 7:15 AM IST

Teacher tested positive for Covid: మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్​కు కొవిడ్​ సోకింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు స్కూల్​ను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

corona
కరోనా

Teacher tested positive for Covid: దేశంలో ఒమిక్రాన్​ వ్యాప్తి కలవరపెడుతోంది. మహారాష్ట్రలోనూ ఈ వేరియంట్​ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఔరంగాబాద్​లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్​కు కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

సరస్వతి భువన్​ స్కూల్​ టీచర్​ డిసెంబర్ 21న కరోనా బారిన పడిన కారణంగా పాఠశాలను కొద్ది రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఔరంగాబాద్​ మునిసిపల్ కార్పొరేషన్​ అధికారి వెల్లడించారు. డిసెంబర్ 27 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు స్పష్టం చేశారు.

"టీచర్​కు స్వల్పంగా కొవిడ్ లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్​లో ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా మెదిలినవారందరికీ ఆర్​టీపీసీఆర్​ పరీక్ష నిర్వహించాం. ప్రస్తుతం సోమవారం వరకు పాఠశాలకు సెలవు ప్రకటించాం." అని ఏఎంసీ డిప్యూటీ కమిషనర్ సంతోష్ తెంగ్లే పేర్కొన్నారు.

23 కొత్త కేసులు..

మహారాష్ట్రలో గురువారం 23మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. దీంతో ఈ వేరియంట్​ సోకిన వారి సంఖ్య 88కి పెరిగింది. అయితే.. కొత్తగా వైరస్​ బారిన పడినవారిలో నలుగురు 18 ఏళ్ల లోపు వారే అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 17 మందిలో అసలు వైరస్ లక్షణాలు లేవని, ఆరుగురిలో కొద్దిగా లక్షణాలు కనిపించాయని తెలిపింది.

పుణెలో 13, ముంబయిలో 5, థానే, నాగ్​పుర్, మిరా భయాందెర్​లో ఒక్కో ఒమిక్రాన్ నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

దేశంలో ఒమిక్రాన్ కలవరం- తమిళనాడులో 33, కర్ణాటకలో 12 కొత్త కేసులు

మహమ్మారిపై యుద్ధం ఇంకా ముగియలేదు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.