ETV Bharat / bharat

చున్నీతో 'ఆమె'​ దారుణ హత్య.. పోలీసులకు చిక్కకుండా మాస్టర్​ ప్లాన్​.. వాట్సాప్​ మెసేజ్​ చూపించి!

author img

By

Published : May 28, 2023, 1:38 PM IST

Updated : May 28, 2023, 2:17 PM IST

క్రైమ్ థ్రిల్లర్​ను మించిన మర్డర్​ మిస్టరీని గుజరాత్ పోలీసులు ఛేదించారు. ప్రియురాలిని హత్య చేసి, పోలీసులను తప్పుదారి పట్టించిన ఓ వివాహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి సహకరించిన మరో ఏడుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుజరాత్​లోని జునాగఢ్​ జిల్లా​లో జరిగింది.

Suraj Bhuvaji Case
Suraj Bhuvaji Case

ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడో వివాహితుడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తన స్నేహితుల సహాయంతో పెట్రోల్​ పోసి తగలబెట్టాడు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకోడానికి, కేసును తప్పుదోవ పట్టించడానికి ఓ మాస్టర్​ ప్లాన్​ వేశాడు. అందులో భాగంగా బాధితురాలు తప్పిపోయిందని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజులు వీరి ప్లాన్​ వర్కవుట్​ అయినా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ హత్య కేసులో ఓ మహిళ సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన గుజరాత్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
ధారా కడివార్ అనే యువతి జునాగఢ్​లో నివసిస్తోంది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన సూరజ్​ భువాజీ అనే వివాహితుడితో 2021లో సోషల్​ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజులు గడిచాక వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భార్యాపిల్లలు ఉన్న సూరజ్​.. ఎలాగైనా తన ప్రియురాలిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అనకున్నదే తడవుగా.. అహ్మదాబాద్​లో ఓ ఫుడ్​స్టాల్​ నడుపుతున్న తన స్నేహితుడు మిట్​ షా సహాయం కోరాడు. ప్లాన్​లో భాగంగా.. లాయర్​ ఫీజు కట్టడానికి అహ్మదాబాద్​ వెళ్లాలని ధారాను నమ్మించాడు సూరజ్​. అనంతరం ధారా, సూరజ్​, మిట్ షా కలిసి 19 జూన్​ 2022న జునాగఢ్​ నుంచి అహ్మదాబాద్​కు బయలు దేరారు. వటవాచ్​ అనే ప్రాంతంలో కారు ఆపారు. డ్రైవర్ సీటులో కూర్చున్న సూరజ్​ ఫీజు చెల్లించడానికి అని కిందకు దిగుతుండగా.. అప్పుడే అక్కడికి వచ్చిన సూరజ్​ సోదరుడు యువరాజ్, అతడి స్నేహితుడు గుంజన్​ జోషి, అతడి అంకుల్​ ముఖేశ్ ధారతో గొడవకు దిగారు. సూరజ్​ను విడిచిపెట్టాలని బెదిరించారు.

Suraj Bhuvaji Case
ప్రధాన నిందితుడు సూరజ్​ భువాజీ

ఆ సమయంలో కారు వెనక సీటులో కూర్చున్న మిట్​ షా.. ధారా చున్నీతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు నిందితులు. సూరజ్​, మీట్​, గుంజన్​, యువరాజ్​, ముఖేశ్​ కలిసి అక్కడ ఉన్న ఎండు గడ్డిని సేకరించి.. మృతదేహంపై పెట్రోలుతో పాటు ఆ గడ్డి వేసి కాల్చేశారు. ఆ తర్వాత సూరజ్, మీట్ కారులో అహ్మదాబాద్ వచ్చారు. ధారా శరీరం పూర్తిగా కాలిపోయే వరకు మిగతా నిందితులు ఘటన స్థలంలోనే ఉన్నారు. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్​ చేరుకున్న సూరజ్​, మీట్.. వారి మరో స్నేహితుడు సంజయ్​ సోహేలియాకు.. ధారా దుస్తులు వేసి కారులో కూర్చోబెట్టారు. దీంతో సీసీటీవీలో రికార్డైన దృశ్యాల్లో.. కారులో మహిళ ఉన్నట్లు పోలీసులను తప్పుదారి పట్టించారు.

ఆ పని పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన మీట్​.. తన తల్లి మోనాబెన్​ షాకు జరిగిన విషయం చెప్పాడు. మీట్​ సోదరుడు జుగల్​ షా.. ధారా మొబైల్​ ఫోన్​ను కారులోకి తీసుకువచ్చాడు. ఆ ఫోన్​ స్విచ్ ఆఫ్​ చేశాడు. అనంతరం నలుగురు కలిసి కారులో సనాతల్​ అనే ప్రాంతం వైపు వెళ్లారు. అక్కడ మిగతా నిందితులను కలిశారు. అక్కడ ధారా ఫోన్​ను తీసుకున్న నిందితులు గుంజన్​ జోషి, యువరాజ్​, ముఖేశ్​.. మరో కారులో ముంబయికి వెళ్లారు.

ఇదిలా ఉండగా, ధారా కనిపించకుండా పోయిందని జూన్​ 20న పోలీసులకు సూరజ్​ ఫిర్యాదు చేశాడు​. సూరజ్​ పోలీస్​ స్టేషన్​లో ఉన్న సమయంలో ధారా ఫోన్​ నుంచి సూరజ్​కు మెసేజ్ చేశారు గుంజన్ జోషి. దీంతో ఆ చాటింగ్​ను పోలీసులకు చూపించాడు సూరజ్​. ఇది నమ్మిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి కూపీ లాగారు. నిందితులను విచారించగా.. వారు నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు సూరజ్​తో పాటు మిగతా ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఇన్​స్టాగ్రామ్​ పరిచయం.. బాలికపై అత్యాచారం..
పదో తరగతిలో పాసైన సందర్భంగా తన తల్లిదండ్రులు కానుకగా ఇచ్చిన ఫోన్​.. ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆమెకు ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైన యువకుడు.. బాలికను బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్​ మీడియాలో అప్​లోడ్ చేస్తానని, తన తల్లిదండ్రులతో చెబుతానని.. తనతో శారీరక సంబంధం కొనసాగించాలని మరోసారి బెదిరించాడు నిందితుడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులు ఉర్వేశ్​ సుతార్​, చిరాగ్​ పటేల్​ను అరెస్టు చేశారు. ఈ ఘటన గుజరాత్​ అహ్మదాబాద్​లోని మేఘానినగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

Last Updated :May 28, 2023, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.