హోంవర్క్ చేయలేదని కోప్పడిన టీచర్​.. రెండో అంతస్తు నుంచి దూకేసిన స్టూడెంట్​..

author img

By

Published : Dec 2, 2022, 10:29 PM IST

student jumps off school building

హెంవర్క్ చేయలేదని టీచర్​ తిట్టాడని ఓ విద్యార్థి.. పాఠశాల భవనం రెండో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో వెలుగుచూసింది.

ఉత్తర్​ప్రదేశ్ అలీగఢ్​ జిల్లాలో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని టీచర్ తిట్టాడన్న కోపంతో ఎనిమిదో తరగతి విద్యార్థి.. పాఠశాల భవనం రెండో అంతస్తు నుంచి దూకేశాడు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థి కిందకు దూకిన దృశ్యాలు నమోదయ్యాయని తెలిపారు.

ఇదీ జరిగింది..
ఠానా బన్నాదేవి ప్రాంతంలోని ఓ పాఠశాలలో మయాంక్(14) అనే విద్యార్థి.. 8వ తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి సంజీవ్ శుక్రవారం ఉదయం అతడిని స్కూల్​లో దింపాడు. ఉర్దూ టీచర్ హోం వర్క్ చేయలేదని మయాంక్​ను మందలించాడు. వెంటనే విద్యార్థి.. పాఠశాల రెండవ అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.

మరుగుదొడ్డి శుభ్రం చేసిన విద్యార్థి..
ఉత్తర్​ప్రదేశ్​లోని కౌశాంబిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఐదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థితో టాయిలెట్​ను శుభ్రం చేయించాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. హెడ్ మాష్టారు.. టాయిలెట్​ శుభ్రం చేయమంటేనే తాను చేశానని విద్యార్థి తెలిపాడు.

నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్​రేప్​..
ఉత్తరాఖండ్ కాశీపుర్​లో దారుణం జరిగింది. స్నేహితుడితో బైక్​పై వెళ్తున్న నర్సింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉత్తర్​ప్రదేశ్​లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన గుర్వింద్​, జస్వంత్​గా పోలీసులు గుర్తించారు. బాధితురాలు నర్సింగ్​ ఫైనల్ ఇయర్​ చదువుతోందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ఎదుట అంగీకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.