ETV Bharat / bharat

శివసేన వర్గాలకు కొత్త పేర్లు.. ఠాక్రే పార్టీకి 'కాగడా' గుర్తు.. ఈసీ నిర్ణయం

author img

By

Published : Oct 10, 2022, 6:13 PM IST

Updated : Oct 10, 2022, 7:58 PM IST

శివసేన ఇరువర్గాలకు కొత్త పేర్లు కేటాయించింది ఎన్నికల సంఘం. మరోవైపు, శివసేన పార్టీ పేరు, గుర్తును ఎలక్షన్​ కమిషన్​ స్తంభింపజేయడాన్ని ఛాలెంజ్​ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఆదేశాలు రద్దు చేయాలని కోరింది.

Sena symbol row
Sena symbol row

శివసేన చీలిక వర్గాలకు కొత్తపేర్లు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 'కాగడా' గుర్తును కేటాయిస్తూ ప్రకటన వెలువరించింది. 'శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే' పేరును ఠాక్రే వర్గానికి కేటాయించింది. కాగా, 'బాలాసాహెబంచి శివసేన' అన్న పేరును శిందే వర్గానికి కేటాయించింది ఈసీ. కొత్త ఎన్నికల గుర్తు ఎంచుకోవాలని ఆ వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. ఇరువర్గాలు కోరినట్లు 'త్రిశూలం', 'గద' గుర్తులను కేటాయించేందుకు ఈసీ నిరాకరించింది. ఇవి మతపరమైన గుర్తులను ప్రతిబింబిస్తున్న నేపథ్యంలో వాటిని పక్కనబెట్టినట్లు స్పష్టం చేసింది.

'శివసేన' పేరు, ఆ పార్టీ గుర్తు అయిన ధనస్సు-బాణంను ఎలక్షన్​ కమిషన్​ను స్తంభింపచేసింది ఈసీ. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు కొత్త పేర్లు, పార్టీకి గుర్తులకు సంబంధించి ఐచ్ఛికాలు సమర్పించాలని ఇదివరకే ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఇరు పార్టీ ఇరువర్గాలు తమకు కేటాయించాల్సిన గుర్తులపై ఐచ్ఛికాలను ఈసీకి సమర్పించాయి. త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఆదివారం కోరింది. శిందే వర్గం సైతం తమ ఐచ్ఛికాలను సమర్పించినట్లు ఈసీ అధికారులు తెలిపారు. పార్టీ గుర్తుగా 'గద'ను కేటాయించాలని శిందే వర్గం కోరినట్లు.. తాజా ఈసీ ప్రకటనను బట్టి అర్థమవుతోంది.

కాగా, శివసేన పేరు, గుర్తును స్తంభింపజేయడాన్ని ఛాలెంజ్​ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ గుర్తు, పేరును నిలిపివేస్తూ ఈసీ అక్టోబర్ 8న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. పార్టీల వాదనలు వినకుండానే చట్టవిరుద్ధంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ఠాక్రే వర్గం వాదించింది. ఈ పిటిషన్​లో ఎన్నికల సంఘం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందేలను ప్రతివాదులుగా చేర్చింది.

ఇవీ చదవండి: పద్మనాభ ఆలయంలోని శాకాహార మొసలి 'బబియా' కన్నుమూత

రెజ్లింగ్​ రింగ్ నుంచి రాజకీయాల్లోకి ములాయం.. సీఎంగా ఎదిగి.. కేంద్రంలో చక్రం తిప్పి..

Last Updated :Oct 10, 2022, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.