ETV Bharat / bharat

కంగన పోస్టులు సెన్సార్ చేయాలని పిటిషన్​- తిరస్కరించిన సుప్రీం

author img

By

Published : Jan 22, 2022, 3:52 PM IST

Kangana Ranaut news: బాలీవుడ్ నటి కంగనా రనౌత్​పై దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆమె సోషల్​ మీడియా పోస్టులను సెన్సార్ చేసేలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

Kangana Ranaut
కంగనా రనౌత్​

Kangana Ranaut news: బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ సోషల్ మీడియా పోస్టులను సెన్సార్​ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తీరస్కరించింది. శాంతి భద్రతల దృష్ట్యా భవిష్యత్​లో ఆమె చేసే ప్రతి పోస్టును పరిశీలించాలని అడ్వకేట్​ చరణ్​జీత్​ సింగ్​ చందర్​పాల్​ చేసిన వినితిని తోసిపుచ్చింది. దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు కంగనా రనౌత్. రైతు ఉద్యమం సహా సిక్కులపై అభ్యంతర ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై దేశవ్యాప్తంగా దాఖలైన అన్ని కేసులను ముంబయిలోని ఖార్​ పోలీస్​ స్టేషన్​కు బదిలీ చేయాలని, ఆరునెలల్లోగా ఛార్జ్​షీట్​ దాఖలు చేసి.. రెండు సంవత్సారాల్లో విచారణ పూర్తి చేయాలని పిటిషనర్​ న్యాయస్థానాన్ని కోరారు. అంతేగాక భవిష్యత్తులో ఆమె చేసే పోస్టులు శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా ఉండకుండా సెన్సార్​ చేసేలా కేంద్ర హోంశాఖ, సమాచార సాంకేతిక శాఖ, టెలికాం రెగ్యులేటరీని ఆదేశించాలని కోర్టును కోరారు.

"కంగన పోస్టులు సమాజంలో చిచ్చుపెట్టేలా, హింసను ప్రేరేపించేలా, మతాలను కించపరిచేలా ఉన్నాయి. సిక్కులను అవమనించడమే గాక వారిని దేశ వ్యతిరేకులుగా చిత్రికరించే విధంగా ఉన్నాయి. సిక్కుల ఊచకోతను సమర్థించేలా ఉన్నాయి. దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఆమె ట్వీట్లు చేస్తోంది. ఆమెకు చట్టపరంగా కఠిన శిక్షలు విధించాలి. అలాంటివారిని విడిచిపెట్టకూడదు" అని పిటిషనర్​ కోర్టును కోరారు. అయితే న్యాయస్థానం మాత్రం ఈ పిటిషన్​ను విచారించేందుకు నిరాకరించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: భాజపాకు మరో షాక్.. పార్టీని వీడనున్న మాజీ సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.