ETV Bharat / bharat

కరోనా కట్టడికి కేంద్రం కొత్త రూల్.. వారందరికీ RTPCR రిపోర్ట్ తప్పనిసరి

author img

By

Published : Dec 29, 2022, 3:20 PM IST

Updated : Dec 29, 2022, 5:00 PM IST

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరొక నింబంధన విధించింది. వివిధ దేశాల నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులు ఆర్​టీపీసీఆర్ రిపోర్టును ఎయిర్ సువిధ పోర్టల్​లో అప్లోడ్ చేయాలని తెలిపింది. జనవరి 1 నుంచి నిబంధన అమలులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

RTPCR test mandatory For international traveler
అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర మరో నిబంధన

చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్​లాండ్​ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది కేంద్రప్రభుత్వం. ఈ దేశాల నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులు తమ ఆర్​టీపీసీఆర్ రిపోర్టును ఎయిర్ సువిధ పోర్టల్​లో అప్లోడ్ చేయాలని నిబంధన విధించింది. జనవరి 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 2శాతం మంది ప్రయాణికులకు ర్యాండమ్​గా చేస్తున్న పరీక్షలకు ఇది అదనంగా ఉంటుందని కేంద్రం తెలిపింది.

ప్రయాణానికి 72 గంటల లోపు చేసుకున్న కొవిడ్​ పరీక్ష రిపోర్టును మాత్రమే సువిధ యాప్​లో అప్​లోడ్​ చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, భారత్​లోనూ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య మంత్రి కోరారు. కరోనా నింబంధలను కఠినతరం చేయాలని సూచించారు. ఎటువంటి ఘటనలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆయన తెలిపారు.

Last Updated : Dec 29, 2022, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.