ETV Bharat / bharat

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి.. గుజరాత్​లో మరో ఏడుగురు

author img

By

Published : Feb 16, 2023, 10:41 AM IST

Updated : Feb 16, 2023, 11:10 AM IST

పెళ్లికి వెళ్లి వస్తున్న రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మరోవైపు, ట్రక్కును జీపు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం గుజరాత్​లో జరిగింది.

road accident in Uttar Pradesh
రోడ్డు ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్..​ బాందాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులందరూ పెళ్లికి వెళ్లి వస్తుండగా పప్రేండా రోడ్డులో బుధవారం జరిగిందీ దుర్ఘటన. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

చిత్రకూట్‌లోని రాజాపుర్‌లో జరిగిన ఒకే పెళ్లికి వస్తున్న రెండు యస్​యూవీ కార్లు పరస్పరం ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ట్రామా సెంటర్​కు తరలించామని వెల్లడించారు. మృతులు, క్షతగాత్రులు పైలాని పోలీస్ స్టేషన్ పరిధిలోని నివైచ్, పిపర్‌హరి గ్రామాలకు చెందినవారని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని.. గురువారం సాయంత్రం వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు.

గుజరాత్​లో ఏడుగురు..
మరోవైపు గుజరాత్​.. పటాన్​లో​ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును జీపు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Last Updated :Feb 16, 2023, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.