ETV Bharat / bharat

ఎనిమిదేళ్ల చిన్నారిపై రేప్.. అరెస్ట్​ చేసే సమయంలో పోర్న్ చూస్తూ..

author img

By

Published : Jan 18, 2022, 3:24 PM IST

Rape Victim: దిల్లీ శివార్లలో ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. అనంతరం మరో రేప్ చేసేందుకు బాలిక కోసం గాలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

minor girl raped
ఏనిమిదేళ్ల బాలికపై అత్యాచారం

Rape Victim: ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారై.. మరో అత్యాచారానికి పాల్పడేందుకు బాలికను వెతుకుతున్నాడు. అదే సమయంలో నిందితుడి సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. ఈ ఘటన దిల్లీ శివార్లలో జరిగింది.

ఇదీ జరిగింది..

అలీపుర్​ ప్రాంతానికి చెందిన బాధితురాలు ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయం వెళ్లి బయటకువస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు సమీర్​.. ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. తన తండ్రికి నిందితుడితో పరిచయం ఉండటం వల్ల ఆమె అతడి వెంటవెళ్లింది. బాధితురాలిని ఓ అడవి ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.

చిన్నారి కనిపించకపోవడంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. సమీర్​ను అరెస్ట్​ చేసే సమయంలో అతను అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో మరో అత్యాచారానికి పాల్పడేందుకు నిందితుడు బాలిక కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమీర్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి : డ్రైనేజీలో అపస్మారక స్థితిలో మందుబాబు.. తీరా లేపి చూస్తే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.