ETV Bharat / bharat

ప్రాణం తీసిన 'ఫొటో షూట్' సరదా.. నదిలో కొట్టుకుపోయిన నవ జంట

author img

By

Published : Apr 4, 2022, 4:50 PM IST

Post-wedding shoot
నవ జంట

Kerala Pre Wedding Shoot Couple: కేరళకు చెందిన ఓ నవ జంట పోస్ట్​ వెడ్డింగ్​ షూట్​ చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో కొట్టకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మరణించగా.. వధువు పరిస్థితి విషమంగా ఉంది.

Kerala Pre Wedding Shoot Couple: కేరళలో సాహసోపేతమైన 'పోస్ట్​ వెడ్డింగ్'​ షూట్​లు, 'సేవ్​ ది డేట్'​ షూట్​లు క్రేజ్​గా మారిపోయాయి. ఇలాంటి కార్యక్రమాల్లో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కోజికోడ్​ సమీపంలోని కుట్టియాడికి చెందిన నవ జంట ఫొటో షూట్​ చేస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా..వధువు పరిస్థితి విషమంగా ఉంది.

Post-wedding shoot
నవ జంట

ఇదీ జరిగింది: కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత షూట్​కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో రెజిల్​ మరణించగా.. కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చదవండి: బాయ్​ఫ్రెండ్​ కారణంగా గర్భం.. యూట్యూబ్ చూసి అబార్షన్​.. కానీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.