ETV Bharat / bharat

65 గంటలు.. 25 మీటింగ్​లు.. బిజీబిజీగా మోదీ ఫారిన్​ షెడ్యూల్​

author img

By

Published : May 1, 2022, 4:54 AM IST

Updated : May 1, 2022, 6:51 AM IST

PM Modi Europe tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 2 నుంచి మూడు రోజుల పాటు యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో దాదాపుగా 7 దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలు, 50 మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో మోదీ సమావేశం కానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో మొత్తంగా 25 సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారని పేర్కొన్నాయి.

pm modi
ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi Europe tour: మే 2 నుంచి మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌ దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని.. తిరుగు ప్రయాణంలో మే 4న పారిస్‌ చేరుకుంటారు. ఈ మూడు దేశాల్లో దాదాపు 65గంటల పాటు గడపనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. డెన్మార్క్‌, జర్మనీలలో ఒక రాత్రి చొప్పున బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 7 దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలు, 50 మంది అంతర్జాతీయ పారిశ్రాకవేత్తలతో సమావేశం కానున్న మోదీ.. మొత్తంగా 25 సమావేశాల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పలువురు ప్రపంచ నేతలతో భేటీలో ద్వైపాక్షిక, బహుపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. వేలాది మంది ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడనున్నారు. ఈ ఏడాదిలో మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.

మరోవైపు.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తోనూ మోదీ చర్చలు జరపనున్నారు. 'జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్స్‌తో బెర్లిన్‌లో మోదీ భేటీ అవుతారు. భారత్‌-జర్మనీ అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో విడత సమావేశాలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. షోల్స్‌తో మోదీ భేటీ ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది' అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి బుధవారం విలేకరులకు వెల్లడించిన విషయం తెలిసిందే. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంపై డెన్మార్క్‌ నిర్వహిస్తున్న సదస్సులోనూ మోదీ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రధానులతో ఆయన మాట్లాడనున్నారని వివరించారు. కరోనా అనంతర ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నవకల్పనలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీల్లో చర్చకు రానున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: 'ఆ లేఖలో ఎలాంటి వాస్తవం లేదు'.. మోదీకి బ్యూరోక్రాట్ల లేఖ

Last Updated : May 1, 2022, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.