దోపిడీ విధానాలపై పోరాటానికే జనసేన పార్టీ : పవన్​ కల్యాణ్​

author img

By

Published : Mar 14, 2023, 10:12 PM IST

Updated : Mar 14, 2023, 11:01 PM IST

pk

Janasena Formation Day Meeting: రెండు చోట్లా ఓడినా తనను ముందుకు నడిపింది పార్టీనేనని.. మహానుభావుల స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ నడిపిస్తున్నానని పవన్​కల్యాణ్​ స్పష్టం చేశారు. మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్బావ సభలో పాల్గొన్న పవన్​.. ఎవరైనా గెలిచే కొద్దీ బలపడతారని అందుకు విరుద్ధంగా.. దెబ్బపడే కొద్దీ జనసేన పార్టీ బలపడుతోందని వెల్లడించారు. ఏపీలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలని తెలిపారు. అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కోసం జనసేన అధికారంలోకి రావాలని అన్నారు.

పవన్​ కల్యాణ్​

Janasena Formation Day Meeting: అసమానతలు, దోపిడీ విధానాలపై ఎదురు తిరగడానికే పార్టీని ఏర్పాటు చేసినట్లు జనసేన అధినేత పవన్​కల్యాణ్​ స్పష్టం చేశారు. మచిలీపట్నంలో జరుగుతున్న జనసేన 10వ ఆవిర్భావ సభలో పాల్గొన్న పవన్​... 2014వ సంవత్సరంలో మార్చి14న జనసేన పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. పార్టీ ప్రారంభించినప్పుడు తనతో కొద్దిమంది మాత్రమే ఉన్నారని అన్నారు. రాజకీయాలు చేయడం తనకు తెలియదని.. చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సు గురించే తన ఆలోచన ఉండేదని స్పష్టం చేశారు. అందుకోసం ధైర్యం చేసి జనసేన పార్టీని ఏర్పాటు చేశానని వెల్లడించారు.

పార్టీ ఏర్పాటుకు స్ఫూర్తి స్వాతంత్య్ర ఉద్యమ నాయకులని పవన్‌ తెలిపారు. జాతీయ జెండా రూపకర్త పింగళి చివరి దశలో ఆకలికి అలమటించారని అన్నారు. బ్రిటీష్‌ వారు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్య్ర ఇచ్చారని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు బలిదానంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. మహనీయులను దృష్టిలో పెట్టుకుని తన వంతు కృషి కోసం తపించినట్లు వివరించారు.

ఓడినా ముందుకే..: అసమానతలు, దోపిడీ విధానాలపై ఎదురుతిరగడానికే పార్టీని ప్రారంభించినట్లు తెలిపారు. అణగారిన వర్గాలకు చేయూత ఇవ్వడానికి పార్టీ ఏర్పాటు స్థాపించనని అన్నారు. అగ్రకులాల్లో ఉన్న పేదలకు అండగా ఉండేందుకు పార్టీ ఏర్పాటు చేశానని వెల్లడించారు. రెండు చోట్లా ఓడినా తనను ముందుకు నడిపింది పార్టీనేనని.. మహానుభావుల స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ నడిపిస్తున్నానని అన్నారు. ధైర్యమే నా కవచమని, ధైర్యం ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతానని స్పష్టం చేశారు. జనసేనకు పిడుగుల్లాంటి జనసైనికులు అండగా నిలబడ్డారని ధైర్యం వ్యక్తం చేశారు.

దెబ్బపడే కొద్దీ బలపడుతున్నాం..: ఎవరైనా గెలిచే కొద్దీ బలపడతారని అందుకు విరుద్ధంగా.. దెబ్బపడే కొద్దీ జనసేన పార్టీ బలపడుతోందని వెల్లడించారు. ప్రజల్లో నిలబడే నాయకులు ఉంటే.. వారితోని ఉంటామని ప్రజలు చూపారని వివరించారు. ఒక్కడిగా ప్రారంభమై, ప్రస్తుతం ప్రతిచోటా 500 మంది క్రియాశీల కార్యకర్తలను సాధించానని వెల్లడించారు.

పదేళ్ల ప్రస్థానంలో మాటలు పడ్డామని.. మన్ననలు పొందామని అన్నారు. ఓటములు ఎదుర్కొన్నా.. ఓరిమితో బరిలోనే ఉన్నామని స్పష్టం చేశారు. ఎప్పటికీ జనాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతోనే జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన ప్రారంభంలో 7 సిద్ధాంతాలు ప్రతిపాదించామని.. రెండున్నర దశాబ్దాలు నలిగి సిద్ధాంతాలను ప్రతిపాదించామని తెలిపారు. జనసేన ఉన్నది మానవత్వాన్ని నిలబెట్టేందుకేనని అన్నారు.

ఒక్క కుల పెత్తనం ఆగాలి..: జనసేన ఉన్నదే సమాజంలో పరివర్తన తీసుకురావడానికని ఆశా భావం వ్యక్తం చేశారు. కులాల మధ్య కొట్లాటలతో సమాజం విచ్ఛిన్నం అవుతుందని హెచ్చరించారు. ఒకే కులాన్ని గద్దె ఎక్కించడానికి తాను వ్యతిరేకినన్నారు. కులాల ఐక్యత సమాజానికి చాలా అవసరమని పేర్కొన్నారు. అణగారిన కులాలకు అండగా ఉండాలనేది తన తపన అని.. తనను కులం పేరుతో దూషిస్తుంటే చాలా బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టలేనని.. కులాలు బాగుండాలని కోరుకుంటానని అన్నారు. వైసీపీ కుల కార్పొరేషన్లను ప్రారంభించిందని మండిపడ్డారు. జాలర్లకు అండగా ఉండేందుకు జీవో 217ను వ్యతిరేకించానని గుర్తు చేశారు.

తప్పుడు చట్టాలను పాటించకపోవడం చాలా అవసరమన్న పవన్‌... కులాలు ఐక్యంగా ఉంటే.. మీ రిజర్వేషన్లు మీరే సాధించవచ్చని స్పష్టం చేశారు. ఏపీలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలని తెలిపారు. అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కోసం జనసేన అధికారంలోకి రావాలని అన్నారు. అగ్ర కులంలో పేద యువతకు అండగా ఉంటానని తెలిపారు. ఉపకార వేతనాలు, విదేశీ విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం నాకు రూ.వెయ్యి కోట్లు ఆఫర్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్న పవన్‌.. ఆఫర్‌ చేసిన రూ.వెయ్యి కోట్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటున్నానని అన్నారు. ప్రజలను డబ్బుతో కొనగలనా? గుండెల్లో స్థానం సాధించగలనా అని పవన్​ ప్రశ్నించారు.

Last Updated :Mar 14, 2023, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.