ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో నైట్​​ కర్ఫ్యూ పొడిగింపు- ఒక్కరోజే 12 కేసులు వచ్చాయని...

author img

By

Published : Sep 14, 2021, 3:47 PM IST

Updated : Sep 14, 2021, 5:24 PM IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8 నగరాల్లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఈ నెల 25వరకు పొడిగించింది(gujarat covid guidelines).

corona
ఆ రాష్ట్రంలో మళ్లీ రాత్రి​ కర్ఫ్యూ

కరోనా కట్టడి కోసం విధించిన రాత్రి కర్ఫ్యూను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్టు గుజరాత్​ ప్రభుత్వం ప్రకటించింది(gujarat covid guidelines). సెప్టెంబర్​ 25 వరకు 8 నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించింది.(gujarat covid cases)

అహ్మదాబాద్​, వడోదరా, రాజ్​కోట్​, జునాగఢ్​, భావ్​నగర్​, జామ్​నగర్​, గాంధీనగర్​లో ప్రస్తుతం రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్​ కర్ఫ్యూ ఉంది. మరోవైపు బహిరంగ వేడుకల్లో ప్రజల పరిమితి(400కు మించకుండా), రాత్రిపూట హొటళ్ల సేవలపై ఉన్న ఆంక్షలను కూడా 25వరకు పొడగించింది రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. గుజరాత్​లో సోమవారం 12 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:- Nipah Virus: కర్ణాటకకూ 'నిఫా' వ్యాప్తి- ఒకరికి పాజిటివ్!

Last Updated :Sep 14, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.