ఆరు రాష్ట్రాల్లో ఎన్​ఐఏ సోదాలు.. ఐసిస్​తో లింకులు ఉన్నవారే టార్గెట్!

author img

By

Published : Jul 31, 2022, 4:14 PM IST

nia raids in gujarat

NIA Conducts Searches: మహారాష్ట్ర, గుజరాత్​ సహా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో దాడులు చేపట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఐసిస్​ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

NIA Conducts Searches: దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, మధ్యప్రదేశ్​లో ఐసిస్​ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్​, కొల్హాపుర్.. గుజరాత్​లోని భరుచ్​, సూరత్​, నవ్​సారి, అహ్మదాబాద్​.. కర్ణాటకలోని భత్కల్​, తుమ్​కుర్.. బిహార్​లోని ఆరియా.. మధ్యప్రదేశ్​లోని భోపాల్​.. యూపీలోని దేవ్​బంధ్​ జిల్లాలో ఈ దాడులు చేపట్టింది. ఈ సోదాల్లో కీలకమైన పలు పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఏన్​ఐఎ జూన్​ 25న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

ఈ దాడుల్లో కర్ణాటకలోని భత్కల్​లో ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో సోదాలు నిర్వహించి.. 30ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు సమాచారం. అతడిని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని గుజరాత్​ యాంటీ టెర్రరిజం స్క్వాడ్​ తెలిపింది. తీవ్రవాద సంస్థ పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బిహార్​లోని నలంద జిల్లాలో గురువారమే సోదాలు నిర్వహించింది.

కేరళలోను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) దాడులు నిర్వహించింది. పోలీసులపై హత్యాయత్నం చేసిన సతిక్​ బచ్చాకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. తిరువనంతపురంలో నిర్వహించిన ఈ సోదాల్లో ఎలక్ట్రానిక్​ వస్తువులు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. మైలాద్​తురాయ్​ చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు ఫిబ్రవరి 21న పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే చెక్​పోస్ట్ వద్దకు వచ్చిన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. పోలీసులపైకి దూసుకొచ్చింది. దీనిపై మొదట పోలీసులు కేసు నమోదు చేయగా.. చట్టవ్యతిరేక కార్యకలపాల నిరోధక చట్టం కింద మళ్లీ కేసు నమోదు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ.

ఇవీ చదవండి: అమ్మకు అదిరే 'రిటైర్​మెంట్​' గిఫ్ట్​.. హెలికాప్టర్​లో ఇంటికి..

'ద్వితీయ శ్రేణి పౌరులుగా మైనారిటీలు! అలా చేస్తే దేశ విభజన ముప్పు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.