ETV Bharat / bharat

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్.. NFCలో ఉద్యోగాలు.. వేలల్లో వేతనాలు..

author img

By

Published : Mar 12, 2023, 12:40 PM IST

నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్​ఎఫ్​సీ) 124 పోస్టులకు గాను నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఉద్యోగాలకై అప్లై చేసుకోవచ్చు. దీని దరఖాస్తు విధానం తదితర వివరాలు మీకోసం..

NFC Recruitment 2023 Notification
ఎన్​ఎఫ్​సీలో 124 ఉద్యోగాలు

నేషనల్ ఫ్యూయల్ కాంప్లెక్స్​లో​(NFC) ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. 124 పోస్టుల భర్తీకిగాను నోటిఫికేషన్​ను విడుదల చేసింది NFC. ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి NFC దరఖాస్తులను కోరుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. NFC రిక్రూట్​మెంట్​ కోసం అప్లై చేయడానికి చివరి తేది 2023, ఏప్రిల్ 10. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్​కు సంబంధించి ముఖ్యమైన తేదీలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అర్హత ప్రమాణాలు, ముఖ్యమైన తేదీల వివరాల కోసం అధికారిక వెబ్​సైట్ ​www.nfc.gov.in వెళ్లి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు
ఎన్​ఎఫ్​సీ 2023 సంవత్సరానికి గాను అధికారిక వెబ్​సైట్ @nfc.gov.inలో 124 ఖాళీల కోసం నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

ఖాళీల వివరాలు

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
చీఫ్ ఫైర్ ఆఫీసర్01
టెక్నికల్ ఆఫీసర్03
డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్02
స్టేషన్ ఆఫీసర్07
సబ్ ఆఫీసర్28
డ్రైవర్ పంప్ ఆపరేటర్ ఫైర్​మెన్83
మొత్తం పోస్టులు124

వేతనాల వివరాలు

పోస్టు పేరునెలవారి వేతనాలు
చీఫ్ ఫైర్ ఆఫీసర్రూ.67,000
టెక్నికల్ ఆఫీసర్రూ.56,100
డిప్యూటి చీఫ్ ఫైర్ ఆఫీసర్రూ.56,100
స్టేషన్ ఆఫీసర్రూ.47,600
సబ్ ఆఫీసర్రూ.35,400
డ్రైవర్, పంప్ ఆపరేటర్, ఫైర్​మెన్రూ.21,700

కేటగిరీ: ఇంజినీరింగ్ జాబ్స్

అధికారిక వెబ్​సైట్: www.nfc.gov.in

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేది- 2023, మార్చి 11
  • దరఖాస్తు ప్రారంభ తేది - 2023, మార్చి 11
  • దరఖాస్తు చివరి తేది - 2023, ఏప్రిల్ 10

దరఖాస్తు విధానం
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ తన అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ @nfc.gov.inలో 124 ఖాళీల కోసం ఎన్​ఎఫ్​సీ రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఎన్​ఎఫ్​సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హత గల అభ్యర్థులు www.nfc.gov.in ద్వారా ఏప్రిల్10 వరకు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీకి ముందుగానే అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.

అర్హత ప్రమాణాలు
అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు బీఈ/ బీటెక్​/ ఏదేని డిగ్రీ/ డిప్లొమాను గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి
18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.

ఎంపిక విధానం
ఎన్​ఎఫ్​సీ ఉద్యోగానికి వివిధ దశలు పూర్తైన తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

డీఆర్​డీవోలో ఉద్యోగ అవకాశాలు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్ బెంగళూరు అప్రెంటిస్ ట్రైనీల కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు గ్రాడుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్, ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీస్ ఇలా వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పై విభాగాలలో 150 పోస్టులకు గానూ దరఖాస్తులను కోరుతోంది. డీఆర్​డీఓ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రతినెల రూ.9000 స్టైఫండ్​గా పొందుతారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.