ETV Bharat / bharat

నీట్ పీజీ ఫలితాలు విడుదల.. పరీక్ష జరిగిన 10 రోజుల్లోనే

author img

By

Published : Jun 1, 2022, 9:06 PM IST

NEET-PG results: నీట్ పీజీ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తీర్ణత సాధించిన వారందరికీ కేంద్రమంత్రి మన్​సుఖ్​ మాండవీవ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. 10 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించినందుకు NBEMSని ప్రశంసలతో ముంచెత్తారు.

NEET-PG results
నీట్ పీజీ ఫలితాలు విడుదల.. పరీక్ష జరిగిన 10 రోజుల్లోనే

NEET Results: నీట్ పీజీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి. కేంద్రమంత్రి మన్​సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రికార్ఢు స్థాయిలో 10 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించిన నేషనల్ బోర్డ్ ఆఫ్​ ఎగ్జామినేషన్​ ఇన్ మెడికల్ సైన్సెస్​ను(NBEMS) ప్రశంసించారు.

నీట్​ పీజీ పరీక్షను మే 21న దేశవ్యాప్తంగా 849 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 1,82,318 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే అంచనా వేసిన తేది కన్నా ముందే ఫలితాలు వెలువడ్డాయి.

ఇదీ చదవండి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.