ETV Bharat / bharat

'మన కరెన్సీ, బ్యాంకులను 'అంతర్జాతీయం' చేద్దాం'

author img

By

Published : Jun 6, 2022, 1:42 PM IST

PM Modi News: అంతర్జాతీయ వాణిజ్యంలో భారత దేశ బ్యాంకులతో పాటు కరెన్సీని ముఖ్యమైన భాగంగా మార్చాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర ఆర్థిక శాఖ చేపట్టిన ఐకానిక్​ వారోత్సవాలను ప్రారంభించిన ఆయన.. అంధులు సులభంగా గుర్తించే వీలున్న వివిధ కరెన్సీ నాణేలను ఆవిష్కరించారు.

మోదీ
మోదీ

PM Modi Indian Economy: అంతర్జాతీయ వ్యాపారం, సరఫరా గొలుసులో భారత దేశ బ్యాంకులతోపాటు కరెన్సీకి కీలక భాగస్వామ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖ చేపట్టిన ఐకానిక్ వారోత్సవాలను ప్రధాని సోమవారం ప్రారంభించారు. 12 ప్రభుత్వ పథకాల్లో భాగంగా యువత, వ్యాపారులు, రైతులకు సులభంగా రుణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన 'జన సమర్థ్​ పోర్టల్'ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. కేంద్రం సమకూర్చిన పక్కా ఇళ్లు, విద్యుత్, గ్యాస్, తాగునీరు, ఉచిత వైద్యం.. పేదల గౌరవాన్ని పెంచాయని తెలిపారు.

"స్వాతంత్ర్య దినోత్సవ 75ఏళ్ల ఉత‌్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశ అభివృద్ధి కోసం తమ తమ స్థాయిల్లో కృషి చేయడం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం. ఆర్థిక సమ్మిళిత కోసం మేము ఒక వేదికను తయారు చేశాం. దాని ఉపయోగాల గురించి అవగాహన పెంచాలి. మన బ్యాంకులు, కరెన్సీ.. అంతర్జాతీయ సరఫరా గొలుసు, వ్యాపారంలో కీలక భాగస్వామి కావడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది."

-- ప్రధాని మోదీ

నాణేలు ఆవిష్కరించిన మోదీ.. అంధులు సులభంగా గుర్తించే వీలున్న కొత్త సిరీస్​ నాణేలను సోమవారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 విలువగల నాణేలు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ డిజైన్‌ను కలిగి ఉంటాయని తెలిపారు. అయితే ఇవి కేవలం స్మారక నాణేలు కావని.. చలామణీలో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ కొత్త సిరీస్ నాణేలు.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్​ లక్ష్యాన్ని ప్రజలకు గుర్తు చేస్తాయని, దేశ అభివృద్ధికి కృషి చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తాయని అన్నారు.

new coin modi
కొత్త సిరీస్​ నాణేలను ఆవిష్కరించిన మోదీ
new coin modi
మోదీ ఆవిష్కరించిన కొత్త నాణేలు

ఇవీ చదవండి: 111అడుగుల ఎత్తైన కేక్​తో సీఎం బర్త్​డే వేడుకలు.. ప్రపంచ రికార్డు!

పవర్​ స్టార్​ కోసం అభిమాని సాహసం.. ఏకంగా 400 కి.మీ నడుచుకుంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.