ETV Bharat / bharat

Lokesh meets Amit Shah: రాజకీయ కక్షతో పెట్టిన కేసులు.. నిజం వైపు ఉండాలని అమిత్‌షాను కోరా: లోకేశ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 4:29 PM IST

Updated : Oct 12, 2023, 5:38 PM IST

nara lokesh
nara lokesh

16:18 October 12

పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని అమిత్‌షాకు చెప్పాను

Lokesh meets Amit Shah: నాలుగున్నరేళ్లుగా దోచుకోవ‌డం, దాచుకోవ‌డం, దాడులు చేయ‌డం త‌ప్పించి జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కలవాలనుకుంటున్నట్లు కిషన్ రెడ్డి ఫోన్‌ చేశారని.. అందుకే దిల్లీలో ఆయనకు కలిసినట్లు నారా లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్లు అమిత్‌షాతో చెప్పినట్లు లోకేశ్ తెలిపారు. రాజమండ్రి జైలులోనే మాజీ నక్సలైట్లు కూడా ఉన్నారని.. చంద్రబాబు భద్రతపై తమకు ఆందోళన ఉన్న విషయాన్ని అమిత్‌షా కు తెలిపినట్లు పేర్కొన్నారు. సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్‌షా అడిగారని, పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని అమిత్‌షాకు చెప్పినట్లు లోకేశ్ వెల్లడించారు. బీజేపీ పేరు చెప్పి వైసీపీ కక్ష సాధిస్తుందని అమిత్‌షా అన్నారని లోకేశ్ తెలిపారు. జగన్ బీజేపీపై నిందలు మోపుతున్నారని అమిత్‌షా తనతో చెప్పినట్లు లోకేశ్ వెల్లడించారు.

బీజేపీ పాత్ర అమిత్‌షా: చంద్రబాబు అరెస్టు వెనుక మేము లేమని అమిత్‌షా స్పష్టంగా చెప్పారని.. అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదని లోకేశ్ పేర్కొన్నారు. బీజేపీనే అరెస్ట్​లు చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నట్లు అమిత్‌షాతో చెప్పానని లోకేశ్ తెలిపారు. బీజేపీ పాత్ర ఉందని తాను అనుకోవట్లేదని లోకేశ్ వెల్లడించారు. బీజేపీ నేతల మౌనంతో ఆరోపణలు వచ్చాయనుకుంటున్నారని లోకేష్‌ చెప్పారు. నిజం వైపు ఉండాలని తాను అమిత్‌షాను కోరినట్లు పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారని.. లోకేశ్ తెలిపారు. రాష్ట్రం నుంచి అమిత్‌షా సమాచారం తీసుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: సీఎంగా చేసిన మంచి ప‌ని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. అస‌లే సైకో అయిన జ‌గ‌న్‌కి అధికారమ‌దం ఎక్కిందని మండిపడ్డారు. ఫ్రస్టేష‌న్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లపై జ‌గ‌న్ ప్రేలాప‌న‌లు చూస్తుంటే పిచ్చి ముదిరింద‌ని స్పష్టం అవుతోందని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని లోకేశ్ తెలిపారు. అందుకే 10 రోజులుగా కేసు విషయమై వైసీపీ మాట్లాడట్లేదని వెల్లడించారు. స్కిల్‌ కేసు వెనుక ఏదో జరుగుతోందని నారా లోకేశ్ ఆరోపించారు. తన తల్లి ఐటీ రిటర్న్‌లు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని లోకేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐటీ రిటర్న్‌లపై సీబీడీటీకి ఫిర్యాదు చేస్తానని లోకేశ్ పేర్కొన్నారు. తాము ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరంలోనే ఉన్నామని... దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిసినట్లు లోకేశ్ తెలిపారు.

అమిత్​ షా-లోకేశ్ భేటీపై బొత్స ఏమన్నారంటే..!​ బాధలు చెప్పుకునేందుకు నారా లోకేశ్​ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి ఉంటారని ఎద్దేవా చేశారు. సీఎంపై చాడీలు చెప్పడానికే కలిశారన్నారు. ఎవరితో కలిసి వెళ్లారన్న అంశం తమ పార్టీకి అవసరం లేదని స్పష్టం చేశారు. దేశానికి హోం మంత్రిగా అమిత్ షాను ఎవరైనా కలవొచ్చన్నారు. భాజపాకు ప్రతీ అంశమూ చెప్పి చేయాల్సిన అవసరం తమకు లేదని బొత్స అన్నారు.

Last Updated :Oct 12, 2023, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.