ETV Bharat / bharat

ఎనిమిది మంది పిల్లలు, భర్తను వదిలి.. 57 ఏళ్ల ప్రియుడితో...

author img

By

Published : May 1, 2022, 2:52 PM IST

Mother Of 8 Eloped With a 57 Year Old Man: 8 మంది పిల్లల తల్లి తన 57 ఏళ్ల ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన రాజస్థాన్​లోని భరత్​పుర్​లో జరిగింది. ఆ మహిళను కోర్టులో హాజరుపరచగా.. పిల్లల వద్దకు వెళ్లేందుకు ఆమెం నిరాకరించింది.

Woman fleed with her lover in Bharatpur
Woman fleed with her lover in Bharatpur

Mother Of 8 Eloped With a 57 Year Old Man: రాజస్థాన్​ భరత్​పుర్​లో 8 మంది పిల్లల తల్లి తన 57 ఏళ్ల ప్రియుడితో కలిసి పారిపోయింది. ఏప్రిల్ 24న తన భార్య 57 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్​ చేశాడంటూ ఆమె భర్త కైత్వారా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మహిళను శనివారం కోర్టులో హాజరుపరిచారు. అయితే తాను స్వచ్ఛందంగా వెళ్లానని.. తనను ఎవరూ కిడ్నాప్​ చేయలేదని తెలిపింది. భర్త, పిల్లల వద్దకు వెళ్లేందుకు మహిళ నిరాకరించింది.

మహిళ తన భర్త, పిల్లలతో కలిసి భరత్​పుర్​ నీమల గ్రామంలో నివసిస్తుంది. వారి ఇంటికి సమీపంలోనే 57 ఏళ్ల వ్యక్తి ఉండేవాడు. దీంతో తరచూ మహిళ అతడి ఇంటికి వెళుతూ ఉండేది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో తన 8 మంది పిల్లలను వదిలి అతడితో పారిపోయింది. ఆరేళ్లుగా వీరిద్దరి మధ్య వ్యవహారం నడుస్తోందని, తన భార్యకు తాయత్తు ఇచ్చి లోబరుచుకున్నాడని.. మహిళ భర్త ఆరోపించాడు.

ఇదీ చదవండి: ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.