ETV Bharat / bharat

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు..

author img

By

Published : Oct 10, 2022, 5:01 PM IST

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలికను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు నిందితుడు. పోలీసులు విచారణ చేపట్టగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
minor-raped-in-kaithal-police-arrested-accused

హరియాణాలోని కైతల్ జిల్లాలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 19ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువకుడు అత్యాచారం చేసి.. దొరికిపోతానన్న భయంతో చిన్నారిపై పెట్రోల్​ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే...
గత ఆదివారం తమ 7 ఏళ్ల చిన్నారి కనిపించడం లేదని.. కుటుంబ సభ్యులు కైతల్​ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. పోలీసులు గ్రామస్థుల సహాయంతో చుట్టు పక్కల గాలింపు చర్యలు చేపట్టగా.. సగం కాలి ఉన్న చిన్నారి మృతదేహం అటవీ ప్రాంతంలో బయటపడింది. అక్కడ దొరికిన దుస్తుల ఆధారంగా పోలీసులు మృతదేహాం చిన్నారిదిగా గుర్తించారు.

విలేకరుల సమావేశంలో ఎస్పీ మక్సూద్ అహ్మద్ మాట్లాడుతూ.. "తప్పి పోయిన చిన్నారి 19 ఏళ్ల యువకుడితో ఎక్కడికో వెళ్తున్న వీడియో ఒకటి వైరల్​గా మారింది. ఆ యువకుడ్ని విచారించగా.. నిందితుడు చిన్నారి ఇంటికి దగ్గరలోనే ఉంటానని.. గతంలో కూడా చిన్నారి తనతో ఆడుకోవడానికి వచ్చినట్లు ఒప్పుకున్నాడు. బాలికను ప్రలోభపెట్టి తన వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించాడు. చిన్నారి గట్టిగా అరవడం వల్ల.. దొరికిపోతాననే భయంతో బాలిక ముఖంపై గట్టిగా నొక్కి చంపినట్లు తెలిపాడు. మృతదేహం భయటపడితే పోలీసులకు పట్టుబడతాననే భయంతో.. నిందితుడు పెట్రోల్​ కొని మృతదేహానికి నిప్పంటించాడు. మృతదేహం సగం కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో లభ్యమైంది. ముందుగా నిందితుడు అత్యాచారం, హత్య చేసి.. సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించినందుకు సెక్షన్​ 365 కింద కేసు నమోదు చేశాం. తరవాత వివిధ సెక్షన్​ల కింది కేసులు నమోదు చేసి.. కోర్టులో హాజరుపరిచాం. అతడికి కోర్టులో పోక్సో చట్టం కింద శిక్ష పడింది. నిందితుడు తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. అతడు మత్తు పదార్థాలకు బానిసైనట్లు గుర్తించాం" అని కేసు వివరాలు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.