ETV Bharat / bharat

'మీ బదులు గంగా నదిలో స్నానం చేస్తా.. రూ.10 ఇవ్వండి'.. యువకుడి వీడియో వైరల్​

author img

By

Published : Dec 24, 2022, 7:23 PM IST

ప్రజల శ్రేయస్సు కోసం గంగా నదిలో స్నానం చేస్తానని, అందుకు పది రూపాయలుు చెల్లించాలని చెబుతున్నాడో వ్యక్తి. ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​కు చెందిన ఓ యూట్యూబర్ చేసిన ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

Manoj Nishad viral video
వైరలైన మనోజ్ నిషాద్ వీడియో

చలికాలంలో గంగాస్నానం చేయాలని అనుకుంటున్నారా? కానీ, చలిని తట్టుకోలేమని వెనకడుగు వేస్తున్నారా? అయితే, మీలాంటి వారి కోసమే ఓ వ్యక్తి వినూత్న ప్రకటన చేశాడు. 'మీ బదులుగా గంగానదిలో స్నానం చేస్తా. అందుకు పది రూపాయలు ఇవ్వండి' అంటూ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. ఉత్తరాఖండ్ హరిద్వార్​లోని హర్ కి పౌరి సమీపంలోని ఘాట్ వద్ద ఈ వీడియోను తీశాడు మనోజ్ నిషాద్ అనే వ్యక్తి.

ఈవెంట్​ మేనేజర్​గా పనిచేస్తున్న మనోజ్ నిషాద్... హరిద్వార్ ఉత్తర ప్రాంతంలో అందరికీ సుపరిచితమే. అయితే కొద్ది రోజుల క్రితం మనోజ్ నిషాద్​ ఓ యూట్యూబ్​ ఛానెల్​ ఓపెన్​ చేశాడు. అందులో ఫన్నీ వీడియోలు చేసి, పోస్ట్​ చేస్తున్నాడు. ఇప్పుడు చేసిన వీడియో కూడా అలాగే చేసిందే. చాలా మంది ప్రముఖులు ఈ వీడియోను షేర్​ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్​గా మారింది.

"ఈ వీడియో ఇంతగా వైరల్​ అవుతుందని నాకూ తెలియదు. కేవలం వినోదం కోసమే ఈ వీడియో చేశాను. చాలా మంది నాకు ఫోన్​ చేస్తున్నారు. హరిద్వార్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కాల్స్ వస్తున్నాయి" అని మనోజ్​ తెలిపారు. వీడియో వైరల్ అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, మనోజ్ నిషాద్ ఓ సామాజిక కార్యకర్త కూడా. తమ ప్రాంతంలో ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులు ప్రభుత్వంపై పోరాటం​ చేశాడు. ఇతని కృషి కారణంగానే ప్రభుత్వం.. ఆసుపత్రిని మంజూరు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.