ETV Bharat / bharat

వేలంలో 'గోల్డ్​ టీ' రికార్డ్​- కిలో రూ.లక్ష!

author img

By

Published : Dec 14, 2021, 4:02 PM IST

Golden Tea 1kg Price: అసోంలో మనోహరి గోల్డ్​ టీ వేలంలో రికార్డ్​ ధర పలికింది. సౌరవ్​ టీ ట్రేడర్స్​ అనే సంస్థ కిలో టీ పొడిని రూ. 99,999కు కొనుగోలు చేసింది. గతేడాది వేలంలో ఈ గోల్డ్​ టీ ధర రూ.75,000గా ఉంది.

Golden Tea 1kg Price
గోల్డ్​ టీ

Golden Tea 1kg Price: మన దేశంలో చాయ్​కు ఉన్న క్రేజే వేరు. అందులోనూ అసోం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తి అయిన టీ పొడికి మంచి డిమాండ్​ ఉంటుంది. ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన టీ పొడులను వేలం వేస్తాయి. ఈ క్రమంలో మంగళవారం.. మనోహరి గోల్డ్​ టీ రికార్డ్​ నమోదు చేసింది. వేలంలో కిలో టీ పొడి రూ. 99,999కు అమ్ముడుపోయింది. గతేడాది వేలంలో ఈ ధర రూ.75,000గా ఉంది.

Golden Tea 1kg Price
మనోహరి గోల్డ్​ టీ

సౌరవ్​ టీ ట్రేడర్స్​ అనే సంస్థ ఈ గోల్డ్​​ టీని కొనుగోలు చేసినట్లు గువాహటి టీ ఆక్షన్ సెంటర్​ కార్యదర్శి దినేశ్​ బిహానీ వెల్లడించారు. ఈ తరహా టీలకు విదేశాల్లో కూడా డిమాండ్​ పెరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు బిహానీ. ఉత్పత్తి సంస్థలు కూడా ఇలాంటి టీ పొడులను మరిన్ని విక్రయించి.. దేశాన్ని ప్రత్యేక టీ పొడులకు కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Golden Tea 1kg Price
గోల్డ్​ టీ

రాష్ట్రంలో మొత్తం 850 టీ గార్డెన్స్​ ఉన్నాయి. ఏటా 650 మిలియన్​ కిలోల టీని అసోం ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశంలోని టీ ఉత్పత్తిలో 52 శాతం.

రికార్డ్​ స్థాయిలో ధర పలుకుతున్నా..

అసోంలో టీ వ్యాపారం నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఇంత భారీ మొత్తానికి టీ పొడి అమ్ముడుపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసోంలోని టీ సంస్థ రికార్డు ధరకు టీ పొడిని విక్రయిస్తున్నా.. ఇండియన్​ టీ అసోసియేషన్​ మాత్రం టీ తోటల విస్తరణపై మరో మూడేళ్ల పాటు నిషేధం విధించాలని కేంద్రాన్ని ఇటీవల కోరింది. ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరగడమే అందుకు కారణమని పేర్కొంది.

ఇదీ చూడండి : బూస్టర్​ డోస్ అవసరమా? భారత్​లో ఎప్పుడు?.. కేంద్రం జవాబులివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.