ETV Bharat / bharat

నడవలేని వీధి శునకానికి 'వీల్​ ఛైర్​'!

author img

By

Published : Mar 26, 2021, 1:40 PM IST

నడవలేని ఓ వీధి శునకానికి వీల్​ ఛైర్​ తయారు చేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు కర్ణాటకకు చెందిన నవీన్ చరంతిమత్​​. కొన్ని రోజుల క్రితం బైకు ప్రమాదంలో వెనక కాళ్లు కోల్పోయిన జాగిలానికి చికిత్స అందించాడు నవీన్​.

Man arranges wheel stand for street dog which lost two legs
నడవలేని శునకం కోసం వీల్​ స్టాండ్​

నడవలేని శునకం కోసం వీల్​ స్టాండ్​

కర్ణాటక హుబ్బళ్లిలోని గోవీ ఓనికి చెందిన ఓ యువకుడు.. నడవలేని వీధి శునకానికి సాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. ఓ ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన జాగిలానికి వీల్ ఛైర్​ను​ తయారు చేసి.. మళ్లీ నడిచేలా చేశాడు నవీన్​ చరంతిమత్​.

యూట్యూబ్​ చూసి..

కొన్ని రోజుల క్రితం ప్రమాదానికి గురైన ఓ శునకాన్ని చూశాడు నవీన్​. ఆ కుక్క దీన స్థితికి చలించిపోయిన.. సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కాళ్లు బాగు చేయడం కుదరదని చెప్పారు వైద్యులు. అయితే ఆ శునకాన్ని ఎలా అయినా మళ్లీ నడిచేలా చేయలనుకున్నాడు. యూట్యూబ్​లో వీడియోలు చూసిన నవీన్​.. తన స్నేహితుల సాయంతో వీల్​ ఛైర్​ తయారు చేశాడు.

"ఆ శునకం రెండు కాళ్లు విరిగిపోయాయి. అది చాలా చిన్నపిల్ల. అందుకే సాయం చేయాలకున్నాను. స్నేహితుల సాయంతో వీల్​ ఛైర్​​ తయారు చేశాను. దీనికి నా స్నేహితులు సహాయం చేశారు. ప్రస్తుతం ఆ శునకం బాగానే నడుస్తుంది. తర్వలోనే కోలుకుంటుంది."

- నవీన్​ చరంతిమత్​, వీల్​స్టాండ్​ తయారు చేసిన వ్యక్తి

మరో రెండు మూడు నెలల్లో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నవీన్​. యువకుడు చేసిన సాయంపై స్థానికులు ప్రశంసిస్తున్నారు.

ఇదీ చూడండి: దేశంలో ఏకైక క్షయ రహిత జిల్లాగా బుద్గాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.