ETV Bharat / bharat

ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.లక్ష వరకు జీతం.. అప్లై చేసేందుకు 3 రోజులే గడువు!

author img

By

Published : Apr 21, 2023, 11:24 AM IST

అంతరిక్ష పరిశోధనా రంగంలో పనిచేయాలనుకునే వారికి మంచి అవకాశం అందిస్తోంది ఇస్రో. సంస్థలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఇస్రో ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ, పోస్టుల వివరాలు, అర్హతలు మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ISRO recruitment for 63 vacancies
ISRO recruitment 2023

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)లో అడుగుపెట్టాలని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం అనేక కోర్సులు చేస్తారు. పరీక్షలు రాస్తుంటారు. ఎలాగైనా ఇస్రోలో ఉద్యోగం సంపాదించాలనే కృషి చేస్తుంటారు. తాజాగా పలు పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రొపల్షన్ కాంప్లెక్స్(IPRC)టెక్నీషియన్, ఇతర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇస్రో. ఇందులో మొత్తం 63 పోస్టులు ఉండగా.. టెక్నికల్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మన్ 'బి', టెక్నీషియన్ 'బి', హెవీ వెహికల్ డ్రైవర్ 'ఎ', లైట్ వెహికల్ డ్రైవర్ 'ఎ', ఫైర్‌మ్యాన్ 'ఎ' పోస్టులను ఇస్రో భర్తీ చేయనుంది. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై.. ఏప్రిల్ 24తో ముగిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో సూచించింది.

పోస్టుల వివరాలు..
టెక్నీషియన్ B(ఫిట్టర్) పోస్టులు-20, టెక్నికల్ అసిస్టెంట్(మెకానికల్) పోస్టులు 15, హెవీ వెహికల్ డ్రైవర్ 'A'పోస్టులు 5, టెక్నికల్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) పోస్టులు 4, టెక్నికల్ అసిస్టెంట్(సివిల్) 3, టెక్నీషియన్ 'B'(వెల్డర్) పోస్టులు 3, టెక్నీషియన్ 'B'(ఎలక్ట్రీషియన్) పోస్టులు 2, లైట్ వెహికల్ డ్రైవర్ 'A' పోస్టులు 2, టెక్నికల్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్) పోస్టులు 1, టెక్నికల్ అసిస్టెంట్(కంప్యూటర్ సైన్స్) పోస్టులు 1, టెక్నిషియన్ 'B'(రిఫ్రిజెరేషన్ అండ్ ఏసీ) పోస్టులు 1,టెక్నిషియన్ 'B'(ప్లంబర్) పోస్టులు 1, డ్రాఫ్ట్స్‌మన్ ‘బి’ (సివిల్) పోస్టులు 1, ఫైర్‌మ్యాన్ 'A'పోస్టులు 1 ఉన్నాయి.

అర్హతలు..
టెక్నీషియన్, ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఫైర్‌మ్యాన్ 'A' పోస్టులకు గరిష్ఠ వయో పరిమితి ఏప్రిల్ 24 నాటికి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇక ఇతర పోస్టులకు గరిష్ఠ వయో పరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లోమా చేసి ఉండాలి.

ఫీజు వివరాలు..
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా పోస్టులకు రూ.500 దరఖాస్తు ఫీజు ఉంటుంది.

వేతనం..
ఈ పోస్టులకు సెలక్ట్ అయ్యి ఉద్యోగం పొందిన వారికి భారీగా వేతనాలు ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందిన వారికి జీతం రూ.44,900 నుంచి రూ.1,42,400 ఉంటుంది. ఇక మిగతా ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతం రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.

అప్లై ఎలా చేసుకోవాలంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.