ఫోన్​లో గేమ్​ ఆడుతూ చనిపోయిన బాలుడు.. అసలేమైందంటే?

author img

By

Published : Sep 4, 2022, 5:26 PM IST

Indore child busy in playing free fire game died due to snake bite
Indore child busy in playing free fire game died due to snake bite ()

ఫోన్​లో గేమ్​ ఆడి ప్రాణాలు కోల్పోయాడు ఓ బాలుడు. పాము కాటు వేస్తున్నా పట్టించుకోకుండా ఫోన్​లో ఫ్రీ ఫైర్​ ఆడుతున్నాడు. పాము కాటేసే సమయంలో అతడు అలాగే గేమ్​ కొనసాగించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని చందన్​నగర్​లో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఫ్రీ ఫైర్​ గేమ్​ ఓ బాలుడి ప్రాణాలు తీసింది. ఫోన్​లో గేమ్​ ఆడుతుండగా.. పాము కాటు వేసింది. అది కూడా చలనం లేకుండా బాలుడు గేమ్​లో నిమగ్నమైపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో జరిగింది. మృతుడిని రింకూగా గుర్తించారు.
అసలేం జరిగిందంటే.. ఇందోర్ చందన్​నగర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ కుటుంబం ఇటుక బట్టీలో పని చేస్తోంది. వారి పిల్లాడు ఫోన్​లో ఆన్​లైన్​ గేమ్​లకు బానిసయ్యాడు. పెద్దవారు పనిచేస్తున్న సమయంలో ఒళ్లు తెలియకుండా ఫోన్​లో ఫ్రీ ఫైర్​ గేమ్​ ఆడుతున్నాడు. పాము వచ్చి బాలుడిని కాటు వేసింది. అయినా అతడు గేమ్​ ఆడుతూనే ఉన్నాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడ్ని గుర్తించిన.. ఆ ఇటుక బట్టీ యజమాని ఆస్పత్రికి తరలించాడు. చికిత్స చేస్తుండంగానే బాలుడు మృతి చెందాడు.

"బాలుడి తండ్రి చందన్​నగర్​లో ఉన్న ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. అతడి స్వస్థలం ఉత్తర్​ప్రదేశ్​లోని లలిత్​పుర్​. గత రెండేళ్లుగా ఇతడు ఇక్కడ పని చేస్తున్నారు. అతడి కుమారుడు పాము కాటుతో చనిపోయాడు" అని చెప్పారు చందన్​నగర్​ పోలీస్​ స్టేషన్ ఇంచార్జి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: 'భర్త పనిచేసే ఆఫీసుకెళ్లి మరీ భార్య వేధించడం క్రూరత్వమే'

భోజనం పెట్టలేదని.. కూతుర్ని తలపై కొట్టి చంపిన తల్లిదండ్రులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.