ETV Bharat / bharat

Corona Update: మళ్లీ భారీగా తగ్గిన కరోనా కేసులు

author img

By

Published : Sep 12, 2021, 9:37 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య (Corona cases in India) గణనీయంగా తగ్గింది. కొత్తగా 28,591 మందికి వైరస్​(Corona Update) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 338 మంది కొవిడ్​(Covid-19) బారిన పడి మరణించారు.

covid cases in india
దేశంలో కరోనా కేసులు

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Corona Cases in India) క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గింది. కొత్తగా 28,591 మంది వైరస్​(Corona Update) బారినపడ్డారు. మరో 338 మంది మరణించారు. ఒక్కరోజే 34,848 మంది కరోనా​ను(Covid-19) జయించారు.

  • మొత్తం కేసులు: 3,32,36,921
  • మొత్తం మరణాలు: 4,42,655
  • మొత్తం కోలుకున్నవారు: 3,24,09,345
  • యాక్టివ్ కేసులు: 3,84,921

పరీక్షలు..

దేశవ్యాప్తంగా శనివారం 15,30,125 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

వ్యాక్సినేషన్

శనివారం ఒక్కరోజే 72,86,883 కొవిడ్​ టీకా (Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ (Health Ministry) పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 73,82,07,378 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా కరోనా (Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,53,314 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 7,753 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,50,71,699కి చేరగా.. మరణాల సంఖ్య 46,37,683కు పెరిగింది.

కొత్త కేసులు ఇలా..

  • అమెరికా - 72,203
  • బ్రెజిల్​- 14,314
  • రష్యా- 18,891
  • బ్రిటన్​- 29,547
  • ఫ్రాన్స్​- 9,601
  • టర్కీ- 22,923
  • ఇరాన్​- 16,654

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.